*అక్కడక్కడా హింసాత్మక ఘటనలు మినహా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 11న ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రమంతటా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినా ప్రజలు ఓపిగ్గా ఓటేయడంతో పోలింగ్ 79 శాతానికి చేరుకుంది. అయితే కొన్నిచోట్ల అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో తాజాగా రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయించింది.గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ వార్డులో పోలింగ్ రోజున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల సమయం ముగిసినా ఓటర్లు క్యూలైన్ లో ఉండటంలో అధికారులు 300 స్లిప్పులను అందజేశారు. అయితే పోలింగ్ కేంద్రం ప్రాంగణానికి ప్రహరి లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు చాలామంది క్యూలైన్లలోకి చొరబడ్డారు. స్లిప్పులు లేకుండానే ఓటు వేశారు. ఈ విషయమై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ రిపోలింగ్ నిర్వహించాలని నివేదిక ఇచ్చారు.అలాగే నరసరావుపేటలోని కేసానుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 94వ పోలింగ్ బూత్ లో పోలింగ్ అధికారి తప్పిదం కారణంగా రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. మాక్ పోలింగ్ సందర్భంగా 50 ఓట్లను వేయించిన పీవో, 50 వీవీప్యాట్ స్లిప్పులను పక్కనపెట్టారు. అయితే ఈవీఎంల్లో మాత్రం ఈ ఓట్లను తీసివేయలేదు. దీన్ని గుర్తించిన అధికారులు రీపోలింగ్ కు ఆదేశాలిచ్చారు.
*2019 ఏడాదికి వాతావరణ అంచనాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే ఉంటుందని తెలిపిన ఐఎండీ.. 96 శాతం సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది. జూన్ మొదటి వారంలో కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంపై మే 15న ధ్రువీకరిస్తామన్నారు. ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలే కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. ఖరీఫ్‌లో రైతులకు అనుకూలంగా వర్షపాతం ఉండే అవకాశం ఉందన్నారు. గత రెండేళ్లలాగే ఈసారి కూడా సాధారణ వర్షాలు కురుస్తాయి. పంటలకు ఎలాంటి ఇదులు ఉండవు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఎల్‌నినో ప్రభావం భారత్‌పై అంతగా ఉండదు. తెలుగు రాష్ర్టాల్లో సాధారణ వర్షపాతమే నమోదవుతుంది. ఈ ఏడాది నుంచి ఉరుములు, పిడుగుపాటు హెచ్చరికల వ్యవస్థలను ప్రారంభిస్తామని తెలిపారు.
*వచ్చే నెలలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ వెల్లడించారు. అంతేకాకుండా రెండు నెలల్లోపు 9 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. గతేడాది నవంబర్ నుంచి 33 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ పరీక్షలు వాయిదా పడవని, ఈ నెల 21న పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓఎంఆర్ తరహాలోనే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, 5 లక్షల మంది పంచాయతీ సెక్రటరీ పరీక్షలు రాయనున్నారని ఉదయభాస్కర్ తెలిపారు.
*ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలుకు ముహుర్తం ఖరారైంది. వరుసగా రెండోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్న మోదీ.. ఈ నెల 26వ తేదీన తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.
* శేషచల కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి పాదాలకు సమీపంలో ఉన్న అటవీప్రాంతంలో అగ్నికీలకలు ఎగసి పడుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైర్ ఇంజన్ వెళ్లే అవకాశం లేకపోవడంతో.. అటవీశాఖ సిబ్బంది మంటులను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. చెట్ల కొమ్ములతో ఎగసి పడుతున్న మంటలను అర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతోనే తరచు ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు TTD ఫారెస్ట్ సిబ్బందితో పాటు భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
* రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్‌కు వివరించారు సీఎం కేసీఆర్. ఇక పాలనలో కొత్తగా తీసుకురానున్న పలు సంస్కరణలు, రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై చర్చించినట్లు తెలుస్తోంది
* మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ వై3 ని ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో 32 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్‌కు చెందిన మిగిలిన ఫీచర్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు. త్వరలో ఆ వివరాలు తెలుస్తాయి. కాగా ఈ ఫోన్‌ను అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.
*నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో 38,905 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 11,690 వద్ద ముగిశాయి. టాటామోటార్స్, కోల్ ఇండియా, టీసీఎస్, ఐటీసీ, టాటా స్టీల్స్ కంపెనీలు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్నటితో పోలిస్తే నేడు రూపాయి ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది.
*ఈవీఎంలపై పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులు భారీగా బయటపడ్డాయి. ఈ స్లిప్పును ఓ విద్యార్థి ప్రతినిధికి తీసుకొచ్చి ఇచ్చారు. స్లిప్పుల కలకలం అంశాన్ని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి తీసుకెళ్లింది. ఈవీఎంల ర్యాండమైజేషన్ చేసిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ స్లిప్పులను భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ద్వారా విషయాన్ని తెలుసుకొని పాఠశాలకు వచ్చిన ఆర్డీవో బృందానికి అనేక కవర్లలో స్లిప్పులు దొరికాయి. దీనిపై స్థానిక అధికారుల వివరణను కోరనున్నట్టు కలెక్టర్ చెప్పారు
* భారత్ తీవ్ర స్థాయిలో వైద్యుల కొరతను ఎదుర్కొంతోది. మన దేశానికి ఆరు లక్షణ మంది డాక్టర్లు ఇరవై లక్షల మంది నర్సులు తక్కువగా ఉనట్లు అంచనా భారత్ లో ప్రతి 10,189 మందికి ఓకే ప్రభుత్వ వైద్యుడే ఉన్నారు. నర్సు, రోగుల నిష్పత్తి 1:483గ ఉంది. ఈ క్రమంలో యాంటిబయాటిక్స్ ఇవ్వడంతో తగినంత శిక్షణ ఉన్న సిబ్బంది కొరత కారణంగా రోగులకు ప్రాణం నిలిపే మందులు అందడం లేదని నిపుణులు చెబుతున్నారు.
*గోదావరి-కావేరి నదులను రూ.60వేల కోట్ల వ్యాయంతో అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి తెలిపారు. తమిళనాడులోని సేలంలో ఆదివారం జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గోదావరి నుంచి 1100 టీఎంసీల నీరు వృధా అవుతోందని దీంతో గోదావరి – కృష్ణా జలాల అనుసంధానం చేపట్టామని తెల;తెలిపారు. తర్వాతి విడతగా ముఖ్యమంతి ఎడప్పాడి పళనిస్వామీ కృషి ఫలితంగా రూ. 60వేల కోట్ల వ్యయంతో గోదావరి –కావేరి నదుల అనుసందనాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.
*తిరుమలకు నీటి గండం పొంచి ఉంది జలాశయాలు వట్టిపోతున్నాయి. పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన తితిదే నీటి పొదుపును చర్యలు ప్రారంభించింది.. మరో 120 రోజులలోపు వర్షాలు కురవని పక్షంలో భక్తకోటికి తీవ్ర అసౌకర్యం కలగనుంది. గతేడాది శేషాచలం కొండల్లో లోటు వర్షపాతం నమోదైంది. జలాశయాలు అరకొరగా నిండాయి. ఇప్పటికే గోగర్భం, ఆకాశ గంగ జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి కుమారధారా, పసుపుధార పాపవినషణం జలాశయాల్లో మాత్రమే నీరు అందుబాటులో ఉంది.ఈ జలాశాయల్లోని నిల్వ నీరు మరో నాలుగు నెలల వరకు చేయవచ్చని తితిదే భావిస్తోంది.
*అగ్నిప్రమాదాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించామని రాష్ట్ర అగ్నిమాపక విపత్తుల నిర్వహణ డైరెక్టర్ జనరల్ కే.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భాగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అన్ని జిల్లా కేంద్రాలకు రూ. 3.50 కోట్లతో ఆధునాతన అగ్నిమాపక పరికరాలు అందజేసినట్లు తెలిపారు. రూ. 5 కోట్లతో 28 కొత్త అగ్నిమాపక వాహనాలను కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన వెంటనే నాలుగు వందల ఫైర్ మెన్, 85మంది డ్రైవర్ 91 హోం గార్డుల పోస్టుల భర్తీ చీస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి పరీక్షలు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ద్రోన్ల ద్వారా అగ్ని ప్రమాదాల నివారణకు ప్రణాళికలు రచిస్తున్నారు.
* కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ గాయపడ్డారు. విషు పర్వదినం సందర్భంగా స్థానిక ఆలయంలో శశిథరూర్‌కు తులాభారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా త్రాసు తెగింది. దీంతో ఆయన కిందపడిపోయారు.
*రేపు ఉదయం 11 గంటలకు శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ నేతి విద్యాసాగర్ వారితో ప్రమాణం చేయిస్తారు. శాసన సభ్యుల కోటా కింద హోం మంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశంలు టీఆర్ఎస్ తరఫున, మీర్జా రియాజ్ హసన్ మజ్లిస్ నుంచి గెలిచారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నర్సిరెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి, కరీంనగర్-మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్ర నియోజకవర్గం నుంచి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. సోమవారం వీరి ప్రమాణ స్వీకారం కోసం శాసనమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
*తెలంగాణ ప్రజల కోణంలో పాలనా సంస్కరణలను చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అత్యుత్తమ సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని వివరించారు
*ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు, రాజకీయ పార్టీలకు విశ్వాసం కల్పించడానికి వీలుగా కనీసం 50% వీవీప్యాట్‌లను లెక్కించాల్సిందేనని 23 భాజపాయేతర పక్షాలు డిమాండు చేశాయి. దేశంలో ఈనెల 11వ తేదీన జరిగిన తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని 50% వీవీప్యాట్‌లను లెక్కించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం నేత నీలోత్పల్ బసు, ఎస్పీ నేత సురేంద్రసింగ్ నాగర్, జేడీఎస్ నేతలు స్పష్టం చేశారు.
*రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనల వల్లనే తెలంగాణ ఏర్పడిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.
*సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి మూడు రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం నెల్లూరు జిల్లాలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు కాకర్ల తిరుమల నాయుడిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దీన్ని నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
*రాష్ట్రంలో పౌరసేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఐటీశాఖ ‘మీసేవ 2.0’ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి ప్రజలు ‘మీసేవ’ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునేందుకు ఇందులో వీలు కల్పించింది. ఇప్పటికే ‘టీ-యాప్ ఫోలియో’ ద్వారా పలు సేవలు అందుబాటులోకి తెచ్చిన ఐటీశాఖ తాజాగా 2.0 వెబ్‌వెర్షన్ ద్వారా ప్రజలు, విద్యార్థులకు తరచూ అవసరమయ్యే 37 ప్రభుత్వ-పౌర సేవలను ఇంటినుంచే పొందే వెసులుబాటు కల్పిస్తోంది.
*తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇంతకాలం స్తబ్దుగా ఉన్న డేటా చౌర్యం కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకోనుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న అశోక్‌కు తెలంగాణ సిట్ అధికారులు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినా వాటికి స్పందన లేకపోవడంతో ఇక ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కేసులో ఏచిన్న అంశమైనా రాజకీయంగా దుమారం రేపుతుందని, దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని ఇంతకాలం సిట్ అధికారులు భావించారు. ఇప్పుడు ఎలాంటి అవరోధాలు లేవు కాబట్టి సోమవారం నుంచి దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు.
* రచయిత, నటుడు, సంపాదకుడు, ప్రయోక్త గొల్లపూడి మారుతీరావు 80వ జన్మదిన వేడుకలను విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యాన విశాఖలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ‘గొల్లపూడి.. ఆశీతి పర్వం- సాహితీ మారుతీయం’ పేరిట నిర్వహించిన వేడుకల్లో ఉదయం సాహితీ గోష్ఠిని నిర్వహించారు. గొల్లపూడి మారుతీరావు సంపాదకత్వంలో వచ్చిన ‘వందేళ్ల కథకు వందనం’ పుస్తకంపై సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి వ్యాఖ్యానం చేశారు.
*మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసు(ఎంఈఎస్)కు చెందిన గ్రూప్-ఎ ప్రొబేషనరీ అధికారులకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్డీ)లో మొదటి ఫౌండేషన్ కోర్సు సోమవారం ప్రారంభం కానుంది.
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో దర్శకుడు రాంగోపాల్‌వర్మ పెట్టిన పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా కార్యకర్త ఒకరు బాచుపల్లి ఠాణాలో ఆదివారం ఫిర్యాదు చేశారు.
*కుమురం భీం జిల్లా కౌటాల మండలంలోని వైగాం, తాటినగర్, మొగడ్‌ధగడ్, కౌటాల గ్రామాల సరిహద్దులో ఆదివారం ఎలుగుబంటి హంగామా చేసింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వైగాం గ్రామంలోని బడికె బావూజీ ఇంట్లో చొరబడింది.
*వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను కేంద్రం అన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తుండగా అది తమకు అక్కర్లేదని తమిళనాడులోని రాజకీయ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నికల ప్రణాళికలో ఆ విషయాన్ని స్పష్టంచేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నాయి. నీట్‌ను రద్దు చేయాలని డీఎంకే తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. భాజపాతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే ఈ పరీక్ష నుంచి తమిళనాడు విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
* సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి మూడు రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం నెల్లూరు జిల్లాలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు కాకర్ల తిరుమల నాయుడిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దీన్ని నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
*తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇంతకాలం స్తబ్దుగా ఉన్న డేటా చౌర్యం కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకోనుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న అశోక్‌కు తెలంగాణ సిట్ అధికారులు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినా వాటికి స్పందన లేకపోవడంతో ఇక ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కేసులో ఏచిన్న అంశమైనా రాజకీయంగా దుమారం రేపుతుందని, దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని ఇంతకాలం సిట్ అధికారులు భావించారు. ఇప్పుడు ఎలాంటి అవరోధాలు లేవు కాబట్టి సోమవారం నుంచి దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు.
* పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ కాన్వాయ్‌పై ఇవాళ రాళ్ల దాడి జరిగింది. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఫ్తీ.. అనంత్‌నాగ్ వెళ్లి అక్కడ్నుంచి బిజ్‌బెహ్రాకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం కాన్వాయ్‌పై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనను నుంచి మెహబుబా ముఫ్తీతో పాటు మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం మెహబుబా ముఫ్తీ అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో అనంత్‌నాగ్ నుంచి ఆమె లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
రీపోలింగ్ జరిగే ప్రదేశాలివే–తాజావార్తలు–04/15
Related tags :