మల్లెపూల మాలలో గుబాళించే మరువం పరిమళం సుపరిచితమే. అయితే అది కేవలం వాసన మొక్కగానే మనందరికీ తెలుసు. కానీ ఇది అద్భుతమైన ఔషధ సుగంధం. అందుకే దీన్ని తాజాగానూ ఎండబెట్టి పొడి చేసీ వంటల్లో వాడితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుందనీ, గ్యాస్ట్రిక్ అల్సర్లు తగ్గుతాయనీ చైనా వైద్యం పేర్కొంటోంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల వ్యాకోచానికీ తోడ్పడతాయి.
* మరువాన్ని వాసన చూసినా తలలో పెట్టుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిది అంటారు. దీన్ని వాసన చూడటంవల్ల డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి. నిద్ర పడుతుంది. అదేసమయంలో రక్తనాళాలు వ్యాకోచించడంవల్ల బీపీ తగ్గి, గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. మధుమేహం కూడా తగ్గుతుంది.
* నెలసరి సరిగ్గా రాని మహిళలూ మెనోపాజ్‌తో ఇబ్బందిపడేవాళ్లూ ఎండబెట్టిన పొడిని కొద్దిగా వంటల్లో వేసుకోవడం లేదా కాసిని ఆకుల్ని ఓ కప్పు నీళ్లలో వేసి మరిగించి తాగినా అవన్నీ సరవుతాయి. గర్భిణీలకి పాలు పడతాయి. పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు దీంతో కాచిన టీ తాగడంవల్ల ఫలితం ఉంటుంది. మూత్ర సమస్యలూ తగ్గుతాయి. ఆకుల్నీ లేదా దీన్నుంచి తీసిన గాఢతైలాన్ని కొద్దిగా తీసుకుని వాసన చూడటంవల్ల గొంతులో శ్లేష్మం తగ్గుతుంది.
* మరువం నుంచి తీసిన తైలం చర్మానికీ మంచిదే. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీర ముడతల్నీ తగ్గిస్తాయి. అందుకే క్రీములూ లోషన్లూ సోపుల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. రెండుమూడు చుక్కల గాఢతైలాన్ని ఇతర నూనెల్లో కలిపి తలకి పట్టించి షాంపూ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
మరువం ఎండబెట్టి పొడిగొట్టి తాగితే…
Related tags :