గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది దృష్టి హారతి వంటిదట. ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి పడకుండా మనం పిల్లలకు.. ఎక్కడి నుంచైన వచ్చిన వాళ్లకు దిష్టి తీస్తాము కదా. అలాగే దేవుడికి దిష్టి తగలకుండా హారతి ఇస్తారట. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారమే. అయితే చాలా మంది ఎందుకు హారతి ఇస్తారు అనే విషయం తెలియదు దేవుడికి దిష్టి తీసిన హారతిని మనం కళ్లకు అద్దుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది దిష్టి తీసిన హారతి.. అందుకే దాన్ని కళ్లకు అద్దుకున్నా కూడా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని పండితులు చెబుతున్నరు. దిష్టి తీసిన గుమ్మడి కాయను మనం ఎలా బయటపడేస్తామో… ఇది కూడా అలాంటిదేనట. హారతి ఇవ్వడం పూర్తవగానే ఆ హారతిని అక్కడ పెట్టేస్తారు. తర్వాత అది ఆరిపోతుంది.
1. శబరిమల తీర్పిచ్చాం..ఈ కేసునూ వింటాం
ముస్లిం మహిళలకు మసీదుల్లో ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే శబరిమల ఆలయం కేసులో తీర్పు ఇచ్చినందువల్లే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించినట్లు జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుణెకు చెందిన ఓ దంపతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, లింగం ఆధారంగా ఏ పౌరుడిపైనా వివక్ష చూపించడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. మసీదుల్లోకి ముస్లిం మహిళలు రాకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. మసీదుల్లోకి ముస్లింలను ఏ దేశంలోనైనా అనుమతిస్తున్నారా అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను అడిగింది. ఇందుకు వారు స్పందిస్తూ.. కెనడా, మక్కాల్లో అనుమతిస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న అనంతరం పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ‘ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి ఒకే ఒక్క కారణం.. శబరిమల వివాదంలో మేం తీర్పు ఇచ్చినందు వల్లే’ అని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కేరళలోని పవిత్ర అయ్యప్ప ఆలయం శబరిమలలోకి అన్ని వయసు మహిళలకు అనుమతి కల్పిస్తూ గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో కేరళలో కొన్ని రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. తీర్పు అనంతరం తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో ఇద్దరు మహిళలు శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు.
2. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి వైదిక పెద్దలు చేసిన పట్టాభిషేకం పూజలు ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేయగా భద్రాచల దివ్యక్షేత్రం భూలోక వైకుంఠమై సాక్షాత్కరించింది. భక్తులు రామనామాన్ని స్మరిస్తూ వేడుకలో పాల్గొన్నారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ నీరాజనాలు పలికారు. సోమవారం ఉదయం పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీరామ నవమి తర్వాత రోజు పుష్యమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేయడంతో దేవాలయం మాడ వీధులన్నీ కిటకిటలాడాయి. ఆలయం తెరిచిన తర్వాత అర్చకులు రామయ్యకు సుప్రభాతం పలికి నామార్చనలు చేసి ఆరాధన కొనసాగించారు. రాజ లాంఛనాలతో పవిత్ర గోదావరి నదికి వెళ్లి తీర్థ బిందెను తీసుకొచ్చి పూజలు చేశారు. కల్యాణమూర్తులను శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి తీసుకురావడంతో భక్తులు పాహి రామ ప్రభో అంటూ ప్రణమిల్లారు. జయజయ ధ్వానాల మధ్య సీతారాముల వారిని మండపంలో వేంచేయింపజేసి క్రతువును ఆరంభించారు. సర్వ లోకాలకు రారాజు అయిన రామయ్యకు పట్టాభిషేక వేడుక ఆద్యంతం భక్తుల మదిని దోచుకుంది. విష్వక్సేన పూజ పుణ్యాహవచనం భక్తిభావాలను పెంచగా ఒక్కో నగను చూపించి వాటి విశిష్టతను వివరించడంతో ఆభరణాల ప్రదర్శన తన్మయత్వాన్ని నింపింది. మంత్రోచ్ఛారణ మారుమోగుతుండగా పట్టు పీతాంబరాలు ధరించి ప్రియ భక్తుడు రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని అలంకరించుకున్న రామయ్య రాచ ఠీవిని వొలకబోశాడు. ఛత్ర చామరాలను, పాదుకలను సమర్పించి ఖడ్గాన్ని అలంకరించి కిరీటాన్ని ధరింపజేశారు. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుని వైభవాన్ని చూడ కన్నులు చాలలేదు. సమస్త పుణ్య తీర్థాలతో నిర్వహించిన అభిషేకం మంత్రముగ్ధులను చేసింది. అహోబిల రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ క్రతువు వైభవంగా జరిగినట్లు ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు తెలిపారు.గవర్నర్ నరసింహన్ దంపతులు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మిథిలా మంటపానికి చేరుకుని పట్టాభిషేకం వేడుకలో పాల్గొన్నారు.
3. మూడేళ్లలో రాజన్నకు 16.73 కిలోల బంగారం
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం బంగారాన్ని తూకం వేశారు. 2016 నుంచి 2019 మార్చి 31 వరకు స్వామివారికి భక్తులు హుండీల ద్వారా, కానుకగా సమర్పించిన నగలు, ఆభరణాల బరువు 16 కిలోల 736 గ్రాములుగా అధికారులు తేల్చారు. దేవాదాయ శాఖ నగల కమిటీ సభ్యురాలు అంజనీదేవి ఆధ్వర్యంలో తూకం వేసిన పసిడిని ఆలయ బ్యాంకు లాకర్లలో భద్రపరచనున్నారు. మంగళవారం వెండిని తూకం వేయనున్నట్లు అధికారులు తెలిపారు.
4. దుర్గామల్లేశ్వర స్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మల్లేశ్వరాలయ ప్రాంగణంలో స్వామి వార్ల ఉత్సవమూర్తులకు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ స్నానాలను రుత్వికులు నిర్వహించారు. పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన, కళారాధన, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. 8 రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ రాత్రి 8 గంటలకు ఎదురుకోలోత్సవం, రాత్రి 10.30 గంటలకు ఆది దంపతుల కల్యాణం జరుగుతుంది. కల్యాణోత్సవంలో పాల్గొనదల్చిన భక్తులు రూ.1,116 టికెట్ తీసుకోవాలని అధికారులు తెలిపారు. దుర్గమ్మదర్శనం చేసుకున్న భక్తులు కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా రాజగోపురం ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
5. శ్రీవారి భక్త కోటికి మరో ‘సేవా వ్యవస్థ’
‘యాత్రికుల సంక్షేమ సేవకులు’ పేరుతో తితిదే కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శ్రీవారిసేవకులు, పరకామణి సేవ, లడ్డూ ప్రసాద సేవ పేరుతో ఎలాంటి పారితోషికం లేకుండా భక్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనానికి వేచి ఉండే యాత్రికులకు మెరుగైన సేవలందించే ఉద్దేశంతో తితిదే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. కొన్ని సందర్భాల్లో భక్తులు కంపార్టుమెంట్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. ఐదారు కంపార్టుమెంట్లకు ఒకరుచొప్పున తితిదే ఉద్యోగి ఉంటారు. యాత్రికులకు ఏదైనా సమస్య తలెత్తితే సమాచారం ఇవ్వడానికి వీలు పడటంలేదు. దీన్ని అధిగమించేందుకు కంపార్టుమెంట్లలోని సహాయకకేంద్రంలో యాత్రికుల సంక్షేమ సేవకులు అందుబాటులో ఉంటారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, లోటుపాట్లను పరిశీలించాక సమర్థంగా అమలు చేస్తామని జేఈవో చెప్పారు.
6. వైభవంగా సీతారాముల పట్టాభిషేక మహోత్సవం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి వైదిక పెద్దలు చేసిన పట్టాభిషేకం పూజలు ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేయగా భద్రాచల దివ్యక్షేత్రం భూలోక వైకుంఠమై సాక్షాత్కరించింది. భక్తులు రామనామాన్ని స్మరిస్తూ వేడుకలో పాల్గొన్నారు. శ్రీరామ నవమి తర్వాత రోజు పుష్యమి సందర్భంగా సోమవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేయడంతో దేవాలయం మాడ వీధులన్నీ కిటకిటలాడాయి. ఆలయం తెరిచిన తర్వాత అర్చకులు రామయ్యకు సుప్రభాతం పలికి నామార్చనలు చేసి ఆరాధన కొనసాగించారు. రాజ లాంఛనాలతో పవిత్ర గోదావరి నదికి వెళ్లి తీర్థ బిందెను తీసుకొచ్చి పూజలు చేశారు. కల్యాణమూర్తులను శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి తీసుకురావడంతో భక్తులు పాహి రామ ప్రభో అంటూ ప్రణమిల్లారు. రామయ్యకు పట్టాభిషేక వేడుక ఆద్యంతం భక్తుల మదిని దోచుకుంది. మంత్రోచ్ఛారణ మారుమోగుతుండగా పట్టు పీతాంబరాలు ధరించి ప్రియ భక్తుడు రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని అలంకరించుకున్న రామయ్య రాచ ఠీవిని వొలకబోశాడు. ఛత్ర చామరాలను, పాదుకలను సమర్పించి ఖడ్గాన్ని అలంకరించి కిరీటాన్ని ధరింపజేశారు. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుని వైభవాన్ని చూడ కన్నులు చాలలేదు.
7. వటపత్రశాయిగా దాశరథి
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం కోదండరామయ్య వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రికి స్వామివారు సింహవాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో విహరించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి వారి ఊరేగింపులో పాల్గొన్నారు.
8. తిరుమల సమాచారం
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లో వేచి ఉన్న భక్తులుసర్వదర్శనం భక్తులకు 20 గంటల సమయం పడుతుంది300 రూ ప్రత్యేక ప్రవేశం కలిగినవారికి 2 నుండి 4 గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 81,195నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 34,630 నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.38 కోట్లు
9. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 16కందుకూరి వీరేశలింగం పంతులు
1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు “ప్రార్థన మరియు ఉపవాసం” నిర్వహించాడు.
1848 : ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జననం ( మ.1919 )
1853 : భారత్ లో రైళ్ళ నడక మొదలయింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడినది.
1889: ప్రముఖ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం (మ.1977)
1946: ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవ మరణం (జ.1880
10. శుభమస్తు
తేది : 16, ఏప్రిల్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ద్వాదశి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 23 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 25 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వఫల్గుణి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 2 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 50 ని॥ వరకు)
యోగము : వృద్ధి
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 8 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 28 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 20 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 25 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 58 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 0 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 32 ని॥ లకు
సూర్యరాశి : మేషము
చంద్రరాశి : సింహము
10. మంగళ , శుక్రవారాల్లో ధనాన్ని ఇవ్వకూడదా ?ఎందుకు ?
మంగళ , శుక్రవారాలలో ధనాన్ని అప్పుగా గానీ , అప్పు తీర్చిడం గానీ , ఎదుటి వారికి ఇస్తే ! ఆ ధనంతో పాటు మన ఇంటి నుండి లక్ష్మిదేవి వెళ్లి పోతుందని ఒక నమ్మకం . సంపాందించేవారు సంపాదిస్తుంటే ఖర్చు చేసే వాళ్ళు ఖర్చు చేస్తారు . కనీసం ఆ రెండు రోజులైనా నియంత్రించాలని ప్రయంత్నం . ఆలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని పొదుపు చెయ్యటానికి మంచి పద్ధతే అయినా మనకిగానీ , ఇతరులకు గానీ కష్టసమయాల్లో ఈ నియమం పనికిరాదని శాస్త్రం చెబుతుంది . మార్గశిర మాసములో లక్ష్మీవారము , శ్రావణమాసంలో శుక్రవారాము హిందువులు ఎక్కువగా పాటిస్తారు .
11. దేవుడి హారతిని కళ్లకు అద్దుకోవద్దట.. ఎందుకంటే?
గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది దృష్టి హారతి వంటిదట. ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి పడకుండా మనం పిల్లలకు.. ఎక్కడి నుంచైన వచ్చిన వాళ్లకు దిష్టి తీస్తాము కదా. అలాగే దేవుడికి దిష్టి తగలకుండా హారతి ఇస్తారట. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారమే. అయితే చాలా మంది ఎందుకు హారతి ఇస్తారు అనే విషయం తెలియదుదేవుడికి దిష్టి తీసిన హారతిని మనం కళ్లకు అద్దుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది దిష్టి తీసిన హారతి.. అందుకే దాన్ని కళ్లకు అద్దుకున్నా కూడా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని పండితులు చెబుతున్నరు. దిష్టి తీసిన గుమ్మడి కాయను మనం ఎలా బయటపడేస్తామో… ఇది కూడా అలాంటిదేనట. హారతి ఇవ్వడం పూర్తవగానే ఆ హారతిని అక్కడ పెట్టేస్తారు. తర్వాత అది ఆరిపోతుంది.
12. ఒంటిమిట్టలో వైభవంగా గ్రామోత్సవం
ఏకశిలానగరి కోదండరామాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నవనీతకృష్ణాలంకారంలో కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీవారి సేవకుల కోలాటాలు, తాళ భజనలు, డప్పు వాయిద్యాలు, చెక్క భజనలతో జగదభిరాముడి గ్రామోత్సవం ఒంటిమిట్ట పురవీధుల్లో వైభవంగా జరిగింది. ఈ నెల 18వ తేదీన సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తితిదే జేఈవో లక్ష్మీకాంతం ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. కల్యాణం నిర్వహణపై కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
దేవుడి హారతిని కళ్లకు అద్దుకోకూడదంట
Related tags :