ఎండాకాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది కూల్‌డ్రింక్స్‌ను ఎడా పెడా తాగేస్తుంటారు. ఇంకా కొంత మందైతే కాలాలతో సంబంధం లేకుండా కూల్ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే నిజానికి ఇవి మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కూల్‌డ్రింక్స్‌ను అధికంగా తాగితే బరువు త్వరగా పెరుగుతారు. వాటిలో ఉండే చక్కెర శరీరంలో కొవ్వును పెంచుతుంది. దీంతో అధిక బరువు పెరుగుతారు. ఫలితంగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. అలాగే ఇతరులు కూడా కూల్ డ్రింక్స్‌ను ఎంత తక్కువగా తాగితే అంత మంచిది. కూల్ డ్రింక్స్ తాగాలనిపించినప్పుడు సహజసిద్ధమైన పానీయాలు తాగండి. కొబ్బరినీళ్లు, పుచ్చకాయ రసం, చెరుకు రసం తదితర పానీయాలు తాగడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి..!
చల్లటి పానీయాలు తాగి మధుమేహం తెచ్చుకోకండి
Related tags :