రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత నోటర్ డామ్ చర్చిలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనలో చర్చి పైకప్పు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈస్టర్ పర్వదినం కోసం ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎంతో విశిష్ఠ చరిత్ర కలిగిన నోటర్ డామ్ చర్చిలో ప్రమాదం జరగడం పారిస్ వాసులను కలచివేసింది. కొంతమంది సీన్ నదిఒడ్డున మంటలు ఆరిపోవాలని ప్రార్థనలు చేశారు. నోటర్ డామ్ చర్చిని 12వ శతాబ్దంలో ప్రారంభించారు. 10 శతాబ్దంలో మొదలుపెట్టిన చర్చి నిర్మాణం 200 ఏళ్లపాటు కొనసాగింది. 18వ శతాబ్ద ప్రారంభంలో క్యాథలిక్‌లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో చర్చి ధ్వంసమైంది. రెండు దశాబ్దాలు కష్టపడిన వాస్తుశిల్పి యూజీన్ వయోల్లెట్ చర్చికి మళ్లీ పూర్వ రూపం తీసుకొచ్చారు. ఈ చర్చి విధ్వంసమే ముఖ్య భూమికగా తీసుకున్న ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో.. “ది హంచ్ బ్యాక్ ఆఫ్ నోటర్‌డామ్” నవలను రాశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల ఆక్రమణ నుంచి తప్పించుకున్నందుకు సూచనగా ఆగస్టు 24, 1944లో ఈ చర్చి గంటల్ని మోగించారు. ప్రమాదం కారణంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమావేశాలను రద్దు చేసుకున్నారు. “మనలో భాగమైన చర్చిలో మంటలు చెలరేగటం ఎంతో బాధాకరం” అని ట్వీట్ చేశారు మాక్రాన్. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అగ్ని మాపక సిబ్బంది వాహనాలకు దారిని వదలాలని ప్రజలకు అక్కడి పోలీసు విభాగం విజ్ఞప్తి చేసింది. నోటర్ డామ్ ఘటనపై ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం యునెస్కో విచారం వ్యక్తం చేసింది. చర్చికి పునర్వైభవం తీసుకురావాలని కోరింది. నోటర్ డామ్ వెలకట్టలేని వారసత్వ సంపదగా అభివర్ణించింది. నోటర్ డామ్‌కు 1991లో యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. నోటర్ డామ్ చర్చిలో మంటలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “అత్యంత భయంకర ఘటన. అవసరమైతే మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్ల ద్వారా నీళ్ల ట్యాంకర్లను వినియోగించాలి. త్వరగా చర్యలు చేపట్టాలి” అని ట్రంప్ ట్వీట్ చేశారు. మెర్కెల్
నోటర్ డామ్ చర్చిలో అగ్నిప్రమాదం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్. నోటర్ డామ్ చర్చి దగ్ధమవుతున్న దృశ్యాలు బాధ కలిగిస్తున్నాయన్నారు.
12వ శతాబ్దంలో ప్రారంభించి 200ఏళ్లు కట్టిన చర్చి అది. బూడిద అయిపోయింది.
Related tags :