లండన్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా? ఇప్పుడు యూకే వీసా మరింత సులభంగా పొందవచ్చు. భారతీయ పర్యాటకులకు వీసా దరఖాస్తు విధానం సులభతరం చేసింది బ్రిటన్ ప్రభుత్వం. వీసా కోసం సమర్పించే ధ్రువీకరణ పత్రాలను ఇకపై ఆన్‌లైన్‌లో నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు. గతంలో ధ్రువపత్రాల పరిశీలన కోసం వీసా కార్యాలయం వరకూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు దరఖాస్తు సమర్పించడం, అపాయింట్‌మెంట్ తీసుకోవడం, రుసుం చెల్లింపు, ధ్రువీకరణ పత్రాల సమర్పణ కూడా ఆన్‌లైన్‌లో చేసే అవకాశం కల్పించారు. www.gov.uk వెబ్‌సైట్ ద్వారా వీసా ప్రక్రియ కొనసాగించవచ్చు.
ఇక సులభంగా బ్రిటన్ వీసా
Related tags :