*ప్రతి ఎన్నికల్లో క్యాస్ట్, రిలీజియన్ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వే కులం, నీదే మతం.. ఆ ప్రాంతంలో ఏ కులం వాళ్లు ఎక్కువగా ఉన్నారు.. ఏ మతం వాళ్లు ఎక్కువగా ఉన్నారు.. ఏ కులం వాళ్లను అభ్యర్గాథి నిలబెడదాం .. ఏ మతం వాళను్ ల అభ్యర్థిగా నిలబెడదాం .. ఎప్పుడు వీటి గురించే పార్టీలు ఆలోచిస్తున్నాయి. ప్రజల సమస్యల గురించి మాట్లాడటం లేదు. నీళ్ల గురించి మాట్లాడటం లేదు. దేశం గురించి మాట్లాడటం లేదు. బెంగళూరులో భూమికి విలువ పెరిగింది కానీ.. మనుషులకు విలువ పెరిగిందా? దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా?! స్థానిక సమస్యలు తెలిసినవాడు, స్థానికుడు నాయకుడు కావాలి. అలాంటివాళ్లను ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి.
*మామీదే దాడి చేసి మామీదే కేసులా – జగన్
రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తల పై దాడి చేయడమే కాకుండా దొంగ కేసులు పెట్టి వేదిస్తున్నరన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నా పోలీసులు ఆయన పై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతో చంద్రబాబు నాయుడు ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన వైకాపా నేతలు పెద్దిరెడ్డి , జంగా కృష్ణమూర్తి, ఆదిమలుపు సురేష్, గోవర్ధన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మాడుగుల వేణుగోపాల్ రెడ్డి కారుమూరి నాగేశ్వరరావు, శ్రీకాంత్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు, పార్ధసారధి, ఎస్వీ మోహన్ రెడ్డిలతో కలిసి రాష్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి పై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు.
* పోలింగ్ దాడులపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు
ఏపీలో పోలింగ్ రోజున ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ గవర్నర్ నరసింహాన్‌ను కోరారు.మంగళశారం నాడు రాజ్‌భవన్‌లో ఆయన గవర్నర్‌తో భేటీ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.తమ పార్టీకి చెందిన ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడ కలిసి వినతి పత్రం సమర్పించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏ రకంగా దాడులు జరిగాయనే విషయాన్ని గవర్నర్‌కు వివరించినట్టు ఆయన తెలిపారు.పోలీస్ వ్యవస్థను ఏ రకంగా చంద్రబాబునాయుడు దుర్వినియోగం చేశాడనే విషయాన్ని తాను గవర్నర్‌కు వివరించామన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకొన్నాడని చెప్పారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి కోడెల శివప్రసాదరావు చొక్కాలను చింపుకొన్నాడని జగన్ ఆరోపించారు. అయితే ఈ విషయమై కోడెలపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. గురజాల ప్రాంతంలో దళితులు, మైనార్టీలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని జగన్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యే శ్రీవాణిపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారన్నారు. అయినా కూడ టీడీపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.పూతలపట్టులో తమ పార్టీ అభ్యర్ధి ఎంఎస్ బాబుపై టీడీపీ నేతలు దాడి చేస్తే కుట్లు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఇంకా అతను ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని ఆయన ప్రస్తావించారు.ఒకే కులానికి చెందిన 45 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారన్నారు. అంతేకాదు తమకు అనుకూలంగా ఉన్నవారికి ఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు.బాధితులపైనే పోలీసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మచిలీపట్నంలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ నుండి బయటకు వచ్చాయన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు స్ట్రాంగ్ రూమ్ నుండి బయటకు తీసుకొచ్చారన్నారు. తమ పార్టీకి చెందిన అభ్యర్ధులకు ఎందుకు ఈ సమాచారం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.స్ట్రాంగ్ రూమ్స్‌ను కేంద్ర పోలీస్ బలగాల ఆధీనంలోకి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుండి సీసీ కెమెరాలను ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి కనెక్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.చంద్రబాబునాయుడు తాను చేసిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించిన ఆధారాలు దక్కకుండా ఉండేలా చేసే అవకాశం ఉందని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులు జాగ్రత్తగా ఉండేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈవీఎంలలో మీట నొక్కిన తర్వాత వేరే పార్టీకి ఓటు వెళ్లినట్టుగా ఉంటే ఓటర్లు ప్రశ్నించే వాళ్లని జగన్ అభిప్రాయపడ్డారు.
*కేజ్రీవాల్ యూ టర్న్ – రాహూల్
ఢిల్లీ లోక్ సభ సీట్ల పంపకాలపై కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తుకుదరలేదు. ఇందుకు గాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆప్ కు 4 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉన్నట్లు రాహుల్ తెలిపారు. అయితే ఇందుకు కేజ్రీవాల్ ఒప్పుకోలేదని… మరోసారి ఆయన యూ టర్న్ తీసుకున్నారని ట్వీట్ చేశారు. ఎప్పటికైనా కాంగ్రెస్ తలుపులు ఆప్ కోసం తెరుచుకుని ఉంటాయని… నిర్ణయాన్ని తొందరగా తీసుకోవాలని సమయం లేదని కేజ్రీవాల్ ను కోరారు రాహుల్.ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి పబ్లిసిటీకి ధనం ఎక్కడ్నుంచి వస్తుందని రాహుల్ ప్రశ్నించారు. ప్రజల డబ్బును దొంగిలించి నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటివారికి మోడీ కట్టబెట్టారని ఆరోపించారు.
*గోరఖ్ పూర్ బరిలో రేసుగుర్రం విలన్
గోరఖ్ పూర్ లోక్ సభ సెగ్మెంట్ నుంచి భోజ్ పురి నటుడు రవికిషన్ ను బీజేపీ పోటీలో నిలిపింది. సోమవారం ఈమేరకు 7 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిం ది. దీంతో మొత్తంగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 420కి చేరింది. గోరఖ్ పూర్ సిట్టింగ్ ఎంపీ ప్రవీణ్ నిషాద్ కు, సంత్ కబీర్ నగర్ టికెట్ ఇచ్చింది.బీజేపీ ఎమ్మెల్యేను బూటుతో కొట్టిన ఇక్కడి సిట్టింగ్ ఎంపీ శరద్ త్రిపాఠిని పక్కన బెట్టింది.2014 ఎన్నికల్లో గోరఖ్ పూర్ సీటు నుంచి యోగి ఆదిత్యనాథ్ గెలుపొందారు. ఆయన యూపీ సీఎంగా వెళ్లడంతో ఆ సీటు ఖాళీ అయిం ది. ఎస్పీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి ప్రవీణ్ నిషాద్ గెలిచారు. తర్వాత బీజేపీలోకి చేరారు. కాగా భోజ్ పురిలో ప్రముఖ నటుడైన రవికిషన్.. తెలుగు సినిమాల్లోనూ పాపులర్. రేసుగుర్రం, సుప్రీం, కిక్2 సినిమాల్లో నటించారు.
*గోరఖ్ పూర్ నుంచి రవికిషన్
ఉత్తరప్రదేశ్ లో అత్యంత కీలకమైన గోరఖ్ పూర్ లోక్ సభ స్థానాన్ని భోజ్ పూరి నటుడు రవికిషన్ ను తమ అభ్యర్ధిగా ప్రకటించి భాజపా అందరినీ ఆశ్చర్యపరచింది అక్కడ సిట్టింగ్ ఎంపీ ప్రవీణ్ నిషాద్ సంత్ కబీర్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తారని పేర్కొంది. యూపీలో ఏడూ లోక్ సభ స్థానాలకు భాజపా సోమవారం అభ్యర్ధులను ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 420 లోక్ సభ స్థానాలకు ఆపార్టీ అభ్యర్ధులను ప్రకటించినట్లు అయింది. గోరఖ్ పూర్ భాజపాకు కంచుకోట యోగి ఆదిత్యనాద్
*కాంగ్రెస్ పదవికి షకీల్ అహ్మద్ రాజీనామా 1998 నుంచి ఐదు సార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లోనూ గోరఖ్ పూర్ ఎంపీగా ఎన్నికయిన యోగిని పార్టీ ఆ తరువాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షకీల్ అహ్మద్ పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అద్యక్షుడు రాహూల్ గాంధీ పంపానని ఆయన సోమవరం ప్రకటించారు. తానూ రెండుసార్లు గెలిచినా బీహార్ లోని మధుబని లోక్ సభ స్థానం టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన షకీల్ ఈనిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యదిగా మంగళవారం నామినేషన్ వేస్తున్నట్లు షకీల్ అహ్మద్ వెల్లడించారు. బీహార్ లో మహాకూతమి పొత్తులో మధుబని లోక్ సభ స్థానాన్ని ఆరునెలల కిందటే ఆవిర్భవించిన వికాస్ శీల్ ఇన్సాస్ పార్టీకి కేటాయించారు. ఆపార్టీ అభ్యర్ధిగా బాలీవుడ్ కళా దర్శకుడు ముకేష్ సాహ్నీ బరిలోకి దిగుతున్నారు.
*మోడీ బయోపిక్ ను మొత్తం చూడండి
ప్రధాని మోదీ బయోపిక్ సినిమాను ఆసాంతం చూసి.. మెరుగైన అవగాహనకు వచ్చిన తర్వాత ఆ చిత్రం విడుదలపై నిషేధానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈనెల 19లోగా నిర్ణయం తీసుకుని, సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. ఈసీ నివేదికను పరిశీలించి ఈనెల 22న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ దీపక్ గుప్త, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
*ఆమ్ ఆద్మీకి నాలుగు స్థానాలు ఇస్తాం
డిల్లీలో పొత్తు కుదుర్చుకునే విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ అద్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వెనకడుగు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రాహూల్ గాంధీ విమర్శించారు. పొత్తు పై చర్చించేందుకు ఇప్పటికీ కాంగ్రెస్ ద్వారాలు తెరిచే ఉన్నాయని స్పష్టం చేసారు. ఈమేరకు ఆయన సోమవారం ఓ ట్విట్ చేశారు. భాజపాను ఓడించడం కోసం కూటమి ఏర్పాటులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి డిల్లీలో నాలుగు స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని అందులో పేర్కొన్నారు. ఈ ట్విట్ చేశారు. భాజపాను ఓడించడం కోసం కూటమి ఏర్పాటులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి డిల్లీలో నాలుగు స్థానాలు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఈ ట్విట్ పై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ చర్చలు ఇప్పటికీ సాగుతున్నాయని ఉత్తరప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల్లో మోడీ వ్యతిరేక ఓటును చీల్చుతూ రాహుల్ గాంధీ భాజపాకు లబ్ది చేకూర్చుతున్నారని ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో డిల్లీలో ఏడు లోక్ సభ స్థానాల్లో భాజపా అభ్యర్ధులు విజయం సాధించారు. మరోవైపు పొత్తుల పై కాంగ్రెస్-ఆప్ నేతలు బుధవారం మరోమారు సమావేశం కానున్నట్లు ఇరు పార్టీల వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల్లో కాంగ్రెస్ తరపున అహ్మద్ పటేల్, ఆప్ తరపున సంజయ్ సింగ్ పాల్గొంటారని తెలిపాయి.
* ఈవీఎంలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉంచండి
ఆంధ్రప్రదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నందున ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడాకు వైకాపా ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీలు అవంతి శ్రీనివాస్, బుట్టా రేణుక, మాజీ ఎంపీలు బొత్స సత్యనారాయణ, వల్లభనేని బాలశౌరిలు… సీఈసీ, కమిషనర్లను కలిసి ఈ మేరకు విన్నవించారు. అనంతరం విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆపద్ధర్మ ప్రభుత్వం తప్పనిసరి అంశాల్లో తప్ప ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని.. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా గుత్తేదారులకు, మీడియాకు చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
*లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు నగరంలో ఆయన రోడ్‌షో చేపట్టారు. కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. అంతకుముందు స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్‌నాథ్ రోడ్ షోలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొనాల్సి ఉండగా.. ఈసీ ఆదేశాలతో ఆయన ర్యాలీకి రాలేదు.
*మాజీ ముఖ్యమంత్రి ఆస్తులను జప్తు చేసిన ఈడీ
సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా ఆస్తులను జప్తు చేసింది. రూ.3.68 కోట్ల విలువైన ఫ్లాట్, స్థలం, ఇల్లు, వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి చౌతాలా ఇప్పటికే న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్నారు.
*ఎన్నికలను బహిష్కరించాలి: కేఏ పాల్
వచ్చే 6 దశల ఎన్నికలను బహిష్కరిస్తేనే ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం, సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈసీకి నిజాయతీ లేదనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఈవీఎంల పనితీరే నిదర్శనం. బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహించకపోతే దేశానికి ఇబ్బందులు తప్పవు’ అని పేర్కొన్నారు. కేఏ పాల్‌కు సోమవారం ఎన్నికల కమిషనర్లు సమయం ఇవ్వలేదు. అదే సమయంలో వైకాపా నేతలు కేంద్ర ఎన్నికల కమిషనర్లను కలవడంతో.. అవినీతి నేతలకు స్వాగతం పలుకుతున్నారంటూ కేఏ పాల్ మండిపడ్డారు.
*ఫరూక్ వ్యాఖ్యలపై రాహుల్ వైఖరేంటి?
ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యవహారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన వైఖరి వెల్లడించాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు డిమాండ్ చేశారు. చెన్నైలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలని ఫరూక్ అబ్దుల్లా కోరుతున్నారని, దీని ద్వారా ఆయన ప్రత్యేక దేశం కోరుతున్నారని పేర్కొన్నారు. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మౌనం వహిస్తున్నారని తెలిపారు.
*గోరఖ్‌పుర్ నుంచి రవికిషన్
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత కీలకమైన గోరఖ్‌పుర్ లోక్‌సభ స్థానానికి భోజ్‌పురి నటుడు రవికిషన్ను తమ అభ్యర్థిగా ప్రకటించి భాజపా అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ సిట్టింగ్ ఎంపీ ప్రవీణ్ నిషాద్.. సంత్ కబీర్‌నగర్ స్థానం నుంచి పోటీ చేస్తారని పేర్కొంది. యూపీలో ఏడు లోక్‌సభ స్థానాలకు భాజపా సోమవారం అభ్యర్థులను ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 420 లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
*స్థానికం’పై వేగం పెంచిన కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు మొదలుపెట్టింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కార్యకర్తలు ఎంతో శ్రమించారని.. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటుచేసి సలహాలు సేకరించే పనిలో నియోజకవర్గాల బాధ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిమగ్నమయ్యారు.
*జాతీయతావాదం, అమరజవాన్ల త్యాగాలు ఎన్నికల ప్రచారాంశాలే
అన్నదాతల ఆత్మహత్యల అంశంలాగే….జాతీయతావాదం, అమర జవాన్ల త్యాగం కూడా ఎన్నికల్లో ప్రచారాంశమేనంటూ ప్రధాని మోదీ సోమవారం స్పష్టం చేశారు. గత నలభై ఏళ్లుగా దేశం ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరవుతోందని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా మిన్నకుండాల్సినంత అగత్యమేమీ లేదని దూరదర్శన్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ఘాటించారు. ‘‘జాతీయతావాదం, అమర జవాన్ల త్యాగాలపై మన అభిప్రాయాలను చెప్పకుండా ఉంటే ఎలా? అసలు జాతీయతావాదం అనే భావన లేకుండా ఏ దేశమైనా ముందడుగు వేయగలుగుతుందా?’’ అని ప్రశ్నించారు.
*చివరి గంటలో పోలింగ్ శాతం ఎలా పెరిగింది?
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో చివరి గంటలో 14 శాతం పోలింగ్ ఎలా పెరిగిందని భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు రావడం ఆలస్యమైందని.. పోలింగ్‌లో వాడని ఈవీఎంలను 48 గంటలు దాటినా సీజ్ చేయకుండా బయటే ఉంచారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం సచివాలయంలో సీఈవో రజత్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
*ప్రణబ్ కుమారుడి విజయానికి ఆర్ఎస్ఎస్ సాయం
పశ్చిమబెంగాల్లో ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ సహాయం తీసుకుంటోంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమారుడు అభిజిత్ముఖర్జీని గెలిపించడానికి ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తోంది. సమస్యల తేనెతుట్టెను కదిపేలా నన్ను బలవంతం చేయొద్దు. కాంగ్రెస్ గేమ్‌ప్లాన్ మొత్తం బయట పెట్టేస్తాను. బహ్రంపోర్ కాంగ్రెస్ అభ్యర్థి అధిర్చౌదరి.. లెఫ్ట్, భాజపా సాయంతో గెలవడానికి వ్యూహాలు పన్నుతున్నారు. ఇలాంటి నిజాయతీలేని వ్యక్తిత్వం గలవారికి ఓట్లు వేయొద్దు. బెంగాల్లో మొత్తం 42 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతోంది.
*జగన్ మీకు హుందాగా కనిపిస్తున్నారా?
ఈవీఎం యంత్రాల్లో వీవీప్యాట్లను 50 శాతం వరకూ లెక్కించాలని తెలుగుదేశం పోరాటం చేస్తోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలలో మార్పులు చేయడం ద్వారా పోలింగ్ మార్చవచ్చని (మ్యానిపులేషన్) కేసీఆర్ కూడా గతంలో చెప్పారని గుర్తుచేశారు. జగన్ హుందాగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు అలా వ్యవహరించడం లేదని కేటీఆర్ వాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. సీఎంగా ఉన్న చంద్రబాబును చెప్పుతో కొట్టాలని అన్న జగన్ తెరాసకు హుందాగా కనిపిస్తున్నారా? అని రావుల ప్రశ్నించారు.
*అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమానించారు
అంబేడ్కర్ జయంతి ఉత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకుండా బాబా సాహెబ్‌ను అవమానించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ధ్వజమెత్తారు. అందుకు నిరసనగా ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
*జాస్వామ్య పరిరక్షణకే ఈసీపై పోరాటం
రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్ యంత్రాలు మొరాయించాయని, దీనికి కారణాలను ఈసీ వెల్లడించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు ఎన్ని ఇబ్బందులు పడినా.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి వారంతా తెదేపాకే ఓటేశారన్నారు. రాష్ట్రంలో 125కి పైగా స్థానాల్లో.. జిల్లాలోని 15 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లోనూ తెదేపాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఈసీ తీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఈ విషయంపై తాము పోరాటం చేస్తామన్నారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ద్వయం దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు
*సీఎం భ్రమల్లో జగన్: దేవినేని
ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికల ఫలితాలు రాకముందే సీఎం అయినట్లుగా భ్రమల్లో జీవిస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు రూ.300 కోట్లను ప్రైవేటు ఏజెన్సీకి వైకాపా నేతలు ఇచ్చారని, బిహార్‌లా రాష్ట్రంలోనూ అల్లర్లు సృష్టించడానికి ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభంజనం ఈ ఎన్నికల్లో కనిపిస్తోందని, తెదేపా 150 సీట్లకు మించి గెలిచినా ఆశ్చర్యం లేదని మంత్రి వ్యాఖ్యానించారు.
*ప్రత్యేక హోదా కోసం కలిసి రావాలి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజకీయాలకు అతీతంగా కేంద్రంలో కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీని బలపరచాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా, జనసేనలకు ఆయన లేఖలు రాశారు. తదుపరి విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
*‘కాంగ్రెస్’ పదవికి షకీల్ అహ్మద్ రాజీనామా
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షకీల్ అహ్మద్ పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పంపానని ఆయన సోమవారం ప్రకటించారు. తాను రెండుసార్లు గెలిచిన బిహార్‌లోని మధుబని లోక్‌సభ స్థానం టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన షకీల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ వేస్తున్నట్లు షకీల్ అహ్మద్ వెల్లడించారు. బిహార్‌లో మహాకూటమి పొత్తులో మధుబని స్థానాన్ని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి కేటాయించారు.
*రిజర్వేషన్ల తగ్గింపుతో బీసీలకు అన్యాయం
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు జులై 4వ తేదీ వరకు సమయం ఉన్నప్పటికీ ఆదరాబాదరాగా ముందుకెళ్లడం సరికాదని భాజపా వ్యాఖ్యానించింది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఓటమి భయంతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీపై, రాజ్యాంగబద్ధ సంస్థలపై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు.
*ముఫ్తీ వాహనశ్రేణిపై రాళ్ల దాడి
పీడీపీ అధ్యక్షురాలు, జమ్ము -కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వాహన శ్రేణిపై సోమవారం రాళ్ల దాడి జరిగింది. దక్షిణ కశ్మీర్‌లోని కిరామ్ ప్రాంతానికి ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లగా స్థానిక యువకులు రాళ్లు విసిరారు. ముఫ్తీ సురక్షితంగా బయటపడగా ఆమె భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. భాజపాతో పీడీపీ పొత్తుపై అసంతృప్తితోనే రాళ్లు విసిరామని వారు చెప్పినట్లు ప్రాథమికంగా తెలిసింది.
*ఎల్ఐసీని భ్రష్టు పట్టిస్తున్న మోదీ
నగదుకొరతతో అల్లాడుతున్న సంస్థలను ఆదుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఐసీని బలవంతం చేస్తున్నారు. రైల్వేలకు రూ.1.50లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇప్పించారు. నిరర్థక ఆస్తులతో కునారిల్లుతున్న ఐడీబీఐ బ్యాంకులో 51శాతం వాటాలు కొనిపించారు. అయినా కంపెనీ నిర్వహణ పాత యాజమాన్యానికే అప్పగించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పాలసీలు తీసుకున్నవారికి ఎల్ఐసీ డబ్బులు తిరిగి చెల్లించలేదు. మోదీ విధానాల కారణంగా 25 లక్షలమంది ఎల్ఐసీ ఏజెంట్లు పనిచేయడం మానేశారు. బీఎస్ఎన్ఎల్లో 45వేల మంది ఉద్యోగులను తీసేయనున్నారు. 22వేల మంది ఉండే బీహెచ్ఈఎల్ ఉద్యోగులు ఆరువేలకు తగ్గిపోయారు.
*నేను చూడని మోడీ
ఎక్కడకు వెళ్ళినా మోడీ, మోడీ అంటూ జపం చేస్తారా. ఏమిటి ఆయన గొప్ప? నేను చూడని మోడీనా ఆయన. అంటూ మాజీ ప్రధాని దేవెగౌడ ప్రధాన మంత్రి పై చిర్రుబురులాడారు. ఎన్నికా ప్రచారంలో భాగంగా సోమవారం చిక్కమంగాలూరులో ఆయన ప్రసంగించారు. మోడీ ఒక్కరే పాకిస్థాన్ పై యుద్ధం చేసినట్లు గొప్పలకు పోతున్నారు. ఆయనకే కాదు మాకూ ధైర్యం ఉంది. గతంలో రెండు సార్లు పాకిస్తాన్ తో నేరుగా యుద్దమే జరిగింది కదా? అప్పుడున్న ప్రధానులు తెగువ చూపారు. ఇలా గొప్పలకు పోలేదు. ఆపై వాజ్ పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో కార్గిల్ యుద్ధం హరిగితే సైన్యానికి సరైన ఆయుధాలు లేవన్న సంగతి బయటపడింది. యుద్దాలను కేంద్ర ప్రభుత్వం కాదు సైనికులు చేస్తారు. అంటూ విరుచుకుపడ్డారు. అవినీతి రహిత భారత్ ను సృష్టిస్తానని గొప్పలు చెప్పే మోడీ ఎన్నికల సందర్భంగా డబ్బాల్లో డబ్బు దించుతున్నారని ఆరోపించారు. పలు సభల్లో మోడీ మోడీ అంటూ కార్యకర్తలు కేకలు పెట్టడాన్ని తప్పుపడుతూ ఖర్మా ఖర్మా అంటూ దేవెగౌడ తలబడుకున్నారు.
*తెదేపా గెలుపుపై సందేహమే లేదు
‘ఎన్నికల్లో ప్రజలంతా తెదేపా పక్షానే ఉన్నందున గెలుపుపై ఎలాంటి సందేహం లేదు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని మొదటి నుంచీ కోరుతున్నాం. ఇప్పుడూ అదే డిమాండును మా నాయకుడు జాతీయ స్థాయిలో చర్చకు పెడుతున్నారు’ అని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయనతో శాసన మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
*మరో రాష్ట్రంలో ఇలా కాకూడదనేదే నా ఆలోచన
ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని తాను పోరాడుతుంటే భయపడుతున్నామంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ‘తప్పులు జరగకూడదు. మరో రాష్ట్రంలో ఇలా జరగకూడదనేదే మా ఆలోచన. దొంగదారులకు వీల్లేదు’ అని స్పష్టం చేశారు. సోమవారం తెదేపా కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘వీవీపాట్లలో పడే పత్రాల్లో 50 శాతం లెక్కించడానికి ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటి?’ అని నిలదీశారు.
*ఏ,బీ,సీ,డీ… ఓట్లవారీగా గ్రామాల విభజన
ఫిలిభిత్‌లో ప్రతిసారి గెలుస్తున్నాను. ఏ గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలి, ఏ గ్రామాన్ని తక్కువ అభివృద్ధి చేయాలనేదానికి కొలబద్ద ఏమిటి?. అందుకే ఓట్లు పడే గ్రామాలను ఏ,బీ,సీ,డీలుగా విభజించాం. 80శాతం ఓట్లు మాకు వేసిన గ్రామం ‘ఎ’ తరగతికి చెందుతుంది. 60శాతం వస్తే ‘బి’, 50శాతం వస్తే ‘సి’, అంతకంటే తక్కువ వస్తే ‘డి’. ముందుగా ‘ఎ’ తరగతి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తాం. తరువాత వరుసగా బి,సి,డి గ్రామాల్లో చేపడతాం. ఇందులో ఏ తరగతిలో ఉండాలనేది మీకే వదిలేస్తున్నాను.
*మోదీ ప్రచారానికి అంత డబ్బెక్కడిది?
ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడ చూసినా ప్రధాని మోదీ ప్రచార ప్రకటనలే కనిపిస్తున్నాయని, అందుకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భాజపా ప్రచారానికి నిధులు సమకూర్చుతున్నది ఎవరని నిలదీశారు. సోమవారం రాహుల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా, మహారాష్ట్రలోని నాందేడ్, గుజరాత్‌లోని మహువాల్లో ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘‘టీవీలలో 30సెకన్ల పాటు ప్రకటనకు రూ.లక్షలు వెచ్చించాలి. మోదీ ప్రకటనలు విపరీతంగా వస్తున్నాయి. ఇంత డబ్బు ఆయనకు ఎక్కడ నుంచి వస్తోంది.
*మోదీకి ‘కోడ్’ లేదా?
‘ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్లోనే డబ్బు తీసుకెళ్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కనిపించదా? ప్రధానికి ఎన్నికల నియమావళి వర్తించదా? భాజపాకు ఎర్ర తివాచీ పరుస్తూ… విపక్ష పార్టీలపై ఈసీ ఒంటికాలి మీద ఎందుకు లేస్తోంది? అధికార పార్టీ ‘నమో టీవీ’ పేరుతో సొంత టీవీ ఛానల్ పెట్టుకుంటే ఏం చర్యలు తీసుకుంది. సాక్షి పత్రిక, ఛానల్‌పై మేం ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోగా… వాటిలో ప్రచురించిన, ప్రసారమైన కథనాలు ఆధారంగా మాపై చర్యలు తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని వ్యవస్థలతో ఎడాపెడా ఆడుకున్న ఈసీకి… కేంద్రంలోని ఐబీ, ఐటీ, ఈడీ వంటి సంస్థలు చేస్తున్న నిర్వాకాలు కనిపించలేదా’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
*మోదీ మళ్లీ వస్తే నియంతృత్వమే
‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దివాలా తీసింది. ఆయనను మరోసారి గెలిపిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు. నియంత పాలనే కొనసాగుతుంది’ అని దేశ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్న మోదీ సూచన మేరకే రాజ్యాంగ సంస్థలన్నీ పని చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల కమిషన్ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిదని ఆరోపించారు.
*మోదీ ప్రచారానికి అంత డబ్బెక్కడిది?
ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడ చూసినా ప్రధాని మోదీ ప్రచార ప్రకటనలే కనిపిస్తున్నాయని, అందుకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భాజపా ప్రచారానికి నిధులు సమకూర్చుతున్నది ఎవరని నిలదీశారు. సోమవారం రాహుల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా, మహారాష్ట్రలోని నాందేడ్, గుజరాత్‌లోని మహువాల్లో ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘‘టీవీలలో 30సెకన్ల పాటు ప్రకటనకు రూ.లక్షలు వెచ్చించాలి. మోదీ ప్రకటనలు విపరీతంగా వస్తున్నాయి. ఇంత డబ్బు ఆయనకు ఎక్కడ నుంచి వస్తోంది.
*మండలి కొత్త సభ్యుల ప్రమాణం
తెలంగాణ శాసనమండలికి ఎంపికైన ఏడుగురు ఎమ్మెల్సీలతో మండలి ఉప ఛైర్మన్ నేతి విద్యాసాగర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో తెరాసకు చెందిన మంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్, యెగ్గె మల్లేశం, మజ్లిస్‌కు చెందిన చెందిన మీర్జా రియాజ్ హసన్‌లు శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గాల నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కూర రఘోత్తమ్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
*చౌతాలా ఆస్తులు జప్తు చేసిన ఈడీ
హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్చౌతాలాకు చెందిన రూ.3.68 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. ఆయనతోపాటు పలువురిపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి, నగదు అక్రమ చలామణి చట్టం(పీఎంఎల్ఏ) కింద వీటిని జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. దిల్లీ, పంచకుల, సిర్సాలో ఈ స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొంది. చౌతాలాతో పాటు ఆయన కుమారులైన అజయ్చౌతాలా, అభయ్చౌతాలా, ఇతరులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇంతకుముందే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
*మంత్రులకే సర్వాధికారాలు
కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాల ఆమోదం కోసం త్వరలో శాసనసభా సమావేశాలు నిర్వహిస్తాం. జిల్లాల్లో మంత్రులకు సర్వాధికారాలు ఇస్తాం. కలెక్టర్ల వద్దనున్న నిధులను మంత్రులకు బదలాయిస్తాం. జిల్లాల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా వ్యవహరించాలి.ఇప్పుడు ప్రజలకు అవినీతి పెద్ద సమస్యగా ఉంది. దానిని పూర్తిగా నిర్మూలిస్తాం. వచ్చే రెవెన్యూ చట్టం పటిష్ఠంగా ఉంటుంది. ఉద్యోగులు ధర్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదు. పురపాలక చట్టం కూడా ప్రజలకు అన్ని విధాల మేలు చేస్తుంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే ఒక్క రూపాయి ఇవ్వకుండా పని జరగాలి. హైదరాబాద్ మహానగరానికి ప్రత్యేక చట్టాన్ని తెస్తాం. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు. వాటికీ అడ్డుకట్ట వేయాలి.
*రాష్ట్రంలో 5,857 ఎంపీటీసీలు
తెలంగాణలో రెండు పంచాయతీల పరిధికి ఒక్కో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) ఉండనుంది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలుండగా 5,857 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అందులో భాగంగా సంబంధిత అధికారులతో సమావేశాలు మొదలు పెట్టింది.
*రక్త పరీక్షకు ఒక్క నమూనా సరిపోదా!
ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత కోసం 50% వీవీప్యాట్లు లెక్కించాలన్న ప్రతిపక్షాల వాదనను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా తోసిపుచ్చారు. ‘రోగ నిర్ధరణకు రక్త పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు రక్త నమూనాలు ఒక చోట తీసుకుంటామా లేదంటే 20 చోట్ల నుంచి సేకరిస్తామా’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 45 ఈవీఎంల్లోనే సమస్య వచ్చినట్లు తెలిపారు. తొలి దశ ఎన్నికల నిర్వహణ తీరుపై సోమవారం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వీవీప్యాట్ల అంశంపై మేం సమర్పించిన ప్రమాణపత్రం ఆధారంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అయిదు వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అప్పటికప్పుడు నిర్ణయించుకొని(ర్యాండం) ఎంపిక చేసి లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పింది.
మోడీ ఓ దుర్మార్గుడు-రాజకీయ-04/16
Related tags :