Movies

వివరించాలనిపిస్తుంది

shruthi haasan wants to explain

‘‘ఏ విషయమైనా మనం చూసే తీరును బట్టి, అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్నిటికీ ఆందోళన పడే వాళ్లని చూస్తే… నాకెందుకో ఒక్క నిమిషం ఆగి, వాళ్లతో మాట్లాడాలనిపిస్తుంది. వాళ్లకు ఓ క్లారిటీ వచ్చేలా విషయాలను వివరించాలనిపిస్తుంది’’ అని అన్నారు శ్రుతీ హాసన్‌. ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉండటం శ్రుతీ హాసన్‌కు అలవాటు. సినిమా, సంగీతం రెండు కళ్లు అని చెప్పే శ్రుతీ హాసన్‌ ప్రయాణాలంటే ప్రాణం పెడతారు. ట్రావెలింగ్‌ గురించి శ్రుతి మాట్లాడుతూ ‘‘కొన్ని ప్రదేశాల్లో అడుగుపెట్టినప్పుడు మనకు మనమే కొత్తగా అనిపిస్తాం. అప్పటిదాకా లేని అలవాట్లు మనలో కొత్తగా తొంగి చూస్తుంటాయి. ఎన్నో అనుభవాలను మనసు పొరల్లో పదిలంగా చేరుతుంటాయి. జీవితం మెల్లగా సాగే క్రమంలో ఆ అనుభవాలు నేర్పిన పాఠాలు ఉపయోగపడతాయి. చాలా సందర్భాల్లో మనం సరైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతుంటాం. అలాంటి సమయాల్లో జీవితం మసగ్గా కనిపిస్తుంది. అలాగని కంగారు పడకూడదు. ఒక్క క్షణం ఆ సమస్య నుంచి దూరం జరగాలి. జీవితం మసగ్గా అనిపించిన ప్రతిసారీ కొత్త ప్రదేశాలకు ట్రావెల్‌ చేయాలి. అప్పుడు ఓ క్లారిటీ వస్తుంది. జీవితం మరింత అందంగా కనిపిస్తుంది’’ అని అన్నారు శ్రుతీ హాసన్‌.