NRI-NRT

శాక్రిమెంటోలో 5కె రన్

5k walk and run in sacremento california by nrts and tags suvidha

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలో స్థానిక సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మార్చ్ 30న (శనివారం) 5కె రన్ నిర్వహించారు. శాక్రమెంటో శివారు పాఠశాలల నుంచి పెద్దఎత్తున విద్యార్థులు, పెద్దలు ఉత్సాహంగా ఈ రన్‌లో పాల్గొన్నారు. 500 మందికి పైగా పొటీదారులతో 5కె రన్‌ను భాస్కర్ వెంపటి, పద్మ ప్రియా మద్ది, అవినాష్ మద్ది, వందన శర్మ, వికాస్ కపాడియా, సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి మెయిదూ పార్కులో 5కె రన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. భారత్‌లోని ఉభయ తెలుగు రాష్ట్రాలలో సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల సహాయార్థం ఈ 5కె రన్‌ను నిర్వహించినట్లు ఆ సంస్థ ప్రతినిధి భాస్కర్ వెంపటి తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ చేస్తున్న కార్యక్రమాల గురించి కాలిఫోర్నియాలోని తెలుగు వారికి ఆయన అవగాహన కల్పించారు. అనంతరం ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు, రాక్లిన్ సిటీ కౌన్సిల్ సభ్యుడు బిల్ హాల్డిన్ షీల్డ్స్ అందజేశారు. సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని అష్టగుర్తి అనే గ్రామాన్ని దత్తతకు తీసుకొని అనేక సేవా కార్యాక్రమాలను నిర్వహించిందని.. త్వరలోనే అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనుందని భాస్కర్ చెప్పారు. అంతేకాకుండా సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయం పట్ల అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేపట్టిందని భాస్కర్ చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహాయసహకారాలు అందించిన ఓవర్సీస్ వాలంటీర్స్ ఫర్ బెటర్ ఇండియా, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ సంస్థలకు సంస్థ ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. 5కె రన్‌ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన విజయ్ భాస్కర్ జొన్నలగడ్డ, నటరాజన్ గుత్త, వెంకట్ నాగం, శ్రీకాంత్ గుర్రాల, నాగ్ దొండపాటి, సాయి మైలవరపు, ఉదయ్ రావులపల్లి, రాఘవ నారపురెడ్డి, నగేష్ చంద్ర, సుందర్ రాజన్, శ్రీకాంత్ యనమండ్ర, దీప్తి యనమండ్ర, రావు దుర్శేటి, శ్రీనివాస్ నిట్టల, నాగేంద్ర పగడాల, రాగా గణేషన్, గాయత్రి గణేషన్, కేయూష్ షా, శ్రీనివాస్ ఈర్పిన, కృష్ణ బాచిన, ఆనంద్ ముదలాపూర్, సిద్ధారెడ్డి, లలితా వేదుల, వెంకట సుబ్బారావు, అనిల్ గోదాసాని, బాల, ఈమాన్ యార్లగడ్డ, కిరణ్ భట్, శ్రీకాంత్ పొట్లూరి, నాగ లక్ష్మి కొంచాడ, తారాచంద్, నవీన్ కుమార్ గుండు, అవినాష్ గుస్సాయిన్, రొజ్ విల్ మనబడి కార్యకర్తలు, వైకే చలం తదితరులందరికీ సువిధ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.