*** కెనడా అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రుల విజయపతాకం
కెనడాలోని అల్బెర్టా రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంతతికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికయి రికార్డు సృష్టించారు. గుంటూరుకి చెందిన ప్రసాద్ పాండా, విజయనగరానికి చెందినా లీల అహీర్ ఈ ఎన్నికల్లో అధికారం చేజక్కించుకున్న యునైటెడ్ కన్సర్వేటివ్ పార్టీ (యుసీపీ) తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఈ గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 16 న అల్బెర్టా ఎన్నికలు జరగగా, ఈ రోజు వాటి ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 87 స్థానాలున్న అసెంబ్లీకి గాను యుసీపీ 64 సీట్లలో గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టబోతోంది. కెనడాలో బాలట్ పేపర్ ను వినియోగించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రసాద్ పాండా, లీల అహీర్ రెండో సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. లీల గత జనవరిలో విజయనగరాన్ని సందర్శించారు. పార్టీ అధ్యక్షుడు జాసన్ కెన్ని అల్బెర్టా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన గతంలో కెనడాకి ఉప ప్రధానిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తో మంచి సంబంధాలు పెట్టుకోవాలని ఆయన ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసారు. మధ్య తూర్పు తర్వాత అల్బెర్టా అపారమైన చమురు వనరులు లభ్యమయ్యే ప్రాంతం.
కెనడా ఎన్నికల్లో ఆంధ్రుల విజయం
Related tags :