న్యూస్ పేపర్లలో చుట్టేసి ఇచ్చే ఇడ్లీ, దోశెలను తినేస్తున్నారా.. తోపుడుబండ్లపై దొరికే వేడివేడి సమోసాలను పేపర్ ప్లేట్‌లలో పెట్టుకొని తింటున్నారా…..అయితే జాగ్రత్త! న్యూస్‌పేపర్లలో ప్యాక్ చేసిన ఆహారపదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ) హెచ్చరిస్తోంది. ఆహార పదార్థాలను వార్తా పత్రికల్లో చుట్టేయడం, పార్సిల్ చేయడం మన దేశంలో సాధారణంగా కనిపిస్తుంది. ఆహార పదార్థాలు ఎంత శుచిగా ఉన్నా వాటిని న్యూస్ పేపర్లలో చుట్టడం వల్ల అవి నెమ్మదిగా విషతుల్యం అవతున్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. న్యూస్‌పేపర్లలో ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం, పార్సిల్ చేయడంపై నిషేధం విధిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జులై 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని పేర్కొంది.
జులై నుండి న్యూస్‌పేపర్లలో టిఫిన్లు చుట్టడం నిషేధం
Related tags :