Fashion

వేసవిలో వివిధ రకాల టోపీ ఫ్యాషన్లు

different types of caps for summer fashion

వేసవి వస్తుంది కదా! టోపీలకు ఎప్పుడూ లేని గిరాకీ ఉంటుంది. అయితే చాలా మందికి ఏ టోపీని వాడాలో తెలిసి ఉండదు. ముఖ్యంగా అది ఎండ నుంచి కాపాడినా,చూడడానికి అందంగానూ కనిపించాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వారు ఇక్కడ ఉన్న టోపీల గురించి తెలుసుకోండి..

*** బేస్‌బాల్ క్యాప్: ఈ రకమైన టోపీలు అమెరికన్ స్టయిల్‌లో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సామాన్య ప్రజలు దీన్ని ధరిస్తారు. అన్ని దేశాల్లోనూ దీనికి ప్రాచుర్యం ఉంది. సింపుల్‌గా, క్యాజువల్‌గా, ధరించడానికి తేలికగా ఉంటుంది. తల మీద ఒక బటన్‌తో ముగిసి ఆరు క్వార్టర్ ప్యానెల్స్‌తో తయారై ఉంటుంది. ముందు భాగంలో ఉండే అట్టను వంకరగానూ చేయొచ్చు.
*** ట్రక్కర్‌క్యాప్ : ఈ టోపీ కూడా బేస్‌బాల్ క్యాప్‌వలె ఉంటుంది. కానీ రెండు క్వార్టర్ ప్యానెల్స్‌తో ముగుస్తుంది.
*** బిగ్‌బ్రీమ్/ ప్లాపీ హ్యాట్ : ఈ రకమైన టోపీలు ఇటీవల చాలా పాపులర్ అయ్యాయి. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్టు ఉండటంతో ఫ్యాషన్‌గానూ మారాయి. తల మీద ఆరు నుంచి పది అంగుళాల వెడల్పు పెద్దగా ఉంటుంది. చాలా రకాల వేరియేషన్స్, రకరకాల మెటీరియల్స్‌తో లభిస్తాయి.
*** స్నాప్‌బ్యాక్ క్యాప్: ఈ టోపీని ఏ వయసు వారైనా ధరించవచ్చు. తల సైజ్‌తో సంబంధం లేకుండా ఇది తయారై ఉంటుంది. దీని వెనకాల రెండు ప్లాస్టిక్ పీస్‌లు ఉంటాయి. దీంతో తల సైజ్‌లో దీన్ని అడ్జస్ట్
చేసుకోవచ్చు.
*** స్టాకింగ్ క్యాప్ : ఈ రకమైన టోపీలు బట్టతో లేదా ఉలెన్‌తో తయారుచేస్తారు. తలను వెచ్చగా ఉంచడానికి, చల్లటి వాతావరణాన్ని తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. చలికాలంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంట్లోనూ వివిధ వేరియేషన్స్ దొరుకుతాయి. కాబట్టి ఎండాకాలం కూడా ఉపయోగపడతాయి.