వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం మిర్చి బస్తాల రాకతో కళకళలాడింది. శుక్రవారం నుంచి వరుసగా 3 రోజుల బంద్ నేపథ్యంలో గురువారం మార్కెట్‌కు దాదాపు 50 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. మార్కెట్ యార్డులో ఏ బ్లాకులో చూసినా మిర్చి బస్తాలే కనిపించాయి. మార్కెట్ పరిపాలనా భవనం మొదలు కొని రైతు విగ్రహం, బస్టాప్, రైతు విశ్రాంతి భవనం మార్గంలో రహదారులన్ని మిర్చి బస్తాలతో నిండిపోయాయి. ధరల విషయానికి వస్తే బుధవారంతో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 300 నుంచి 500 వరకు తగ్గాయి. మార్కెట్‌కు వచ్చిన 50 వేల బస్తాల్లో 30 వేల బస్తాలు మాత్రమే రికార్డులో రాసి మిగిలిన 20 వేల బస్తాలు తెల్ల కాగితాలపై నమోదు చేసుకున్నారు.
వరంగల్ యార్డులో చూడముచ్చటగా మిర్చి బస్తాలు
Related tags :