ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో భారత యువ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, నవ్‌దీప్ సైనీ బౌలింగ్ తననెంతో ఆకట్టుకుందని ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీ అన్నాడు. ఈ ఇద్దరు యువ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించాడు. ‘ఐపీఎల్‌లో ప్రసిధ్ కృష్ణ 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతున్నాడు. అలాంటి మరో బౌలరే నవ్‌దీప్ సైనీ. ప్రస్తుతం భారత్‌లో మంచి పేసర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తరహా పేసర్లు బయటకు రావడం భారత క్రికెట్‌కు సానుకూల పరిణామం. ప్రస్తుతమున్న భారత బౌలర్లు మంచి వేగంతో బంతులు వేస్తుండటం సంతోషకరం’ అని బ్రెట్‌లీ అన్నాడు. మరొకవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నవ్‌దీప్ సైనీ ప్రధాన బౌలర్‌గా ఉన్నాడన‍్నాడు. షైనీ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు వేగంగా బంతులు విసురుతున్నాడన్నాడు. అదే అతనికి వరల్డ్‌కప్ భారత స్టాంబ్‌బై ఆటగాళ్లలో చోటు దక్కేలా చేసిందని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
యువపేసర్లకు బ్రెట్‌లీ ప్రశంసలు
Related tags :