Health

అజీర్తికి విరుగుడు బెల్లం

jaggery helps curing indigestion

కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది. అయితే, కొన్ని పదార్థాలను తినడం ద్వారా, ఆ దోషం తొలగిపోతుంది. ఆయా పదార్థాలు, వాటి విరుగుళ్ల వివరాలు…నేతితో తయారు చేసిన పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కలిగే అజీర్తి, మజ్జిగలో నిమ్మరసం, కాస్తంత ఉప్పు కలిపి తాగితే తగ్గిపోతుంది.
నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను ఎక్కువగా తినడం వల్ల కలిగే అజీర్తికి, కొంచెం బెల్లం తింటే చాలు.మామిడ పండ్లు ఎక్కువగా తింటే కలిగే అజీర్తికి, మూడు పూటలా ఒక్కోగ్లాసు చొప్పున మజ్జిగ తాగితే చాలు.రాత్రిళ్లు చపాతీలు ఎక్కువగా తినడం వల్ల కలిగే అజీర్తి, దోసకాయ కూర తింటే తగ్గిపోతుంది. కాకరకాయ కూర ఎక్కువగా తింటే కలిగే అజీర్తి, కొంచెం నిమ్మరసం తీసుకుంటే తగ్గిపోతుంది.బాదం పప్పు అతిగా తింటే కలిగే అజీర్తికి, ఒక లవంగం తింటే చాలు.పాయసం ఎక్కువగా తింటే కలిగే అజీర్తి, పెసరకట్టు తాగితే తగ్గిపోతుంది.అరటి పండ్లు ఎక్కువగా తింటే కలిగే అజీర్తి, నేతిలో కొంచెం పంచదార కలిపి తింటే తొలగిపోతుంది.మినప పప్పుతో చేసిన గారెలు, సున్నుండలు ఎక్కువగా తింటే కలిగే అజీర్తికి మజ్జిగ తాగితే సరిపోతుంది.సెనగలు, సెనగ వంటకాలు ఎక్కువగా తిన్నప్పుడు కలిగే అజీర్తికి, కొంచెం ముల్లంగి రసం తాగితే తగ్గిపోతుంది.కందకూర గానీ, పులుసు గానీ ఎక్కువగా సేవిస్తే కలిగే అజీర్తికి కొంచెం బెల్లం తింటే సరిపోతుంది. చేపలు ఎక్కువగా తినడం వల్ల కలిగే అజీర్తి మామిడి పండ్ల రసం తాగితే తగ్గిపోతుంది.