NRI-NRT

డాలస్‌లో ఉల్లాసంగా నాట్స్ “స్వరవర్షిణి”

nats swaravarshini in dallas for 2019 nats convention

* సంబరాలకు ముందస్తు పోటీలకు తెలుగు ప్రజల విశేష మద్దతు
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో అమెరికాలో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ డాలస్ లో స్వరవర్షిణి కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగవైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు ముందస్తుగా నాట్స్ నిర్వహించిన ఈ స్వర వర్షిణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. డాలస్ వేదికగా ఈ సారి జరగనున్న అమెరికా తెలుగు సంబరాల్లో ఈ స్వర వర్షిణి విజేతలకు నాట్స్ బహుమతులు ప్రదానం చేయనుంది. డాలస్ లో చిన్నారుల గాన మాధుర్యాన్ని, తెలుగు ప్రేమాభిమానాలను వెలికితీసేలా స్వర వర్షిణి కార్యక్రమం జరిగింది. నాట్స్ తెలుగు సంబరాల సాంస్కృతిక విభాగం నిర్వహించిన ఈ గానపోటీల్లో వందిమంది పైగా చిన్నారులు పాల్గొన్నారు. ఆరేళ్ల వయస్సు నుంచి మూడు విభాగాలుగా చిన్నారులను విభజించి నాట్స్ ఈ పోటీలు నిర్వహించింది. ఇందులో పాల్గొన్న తెలుగుచిన్నారులకు సంబరాల వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించనున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కూడా నాట్స్ వారికి అందించనుంది. ఇప్పటికే నాట్స్ సంబరాలకు సంబంధించి క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం, నృత్యం తదితర అంశాల్లో స్థానిక ఔత్సాహిక కళకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుగు సంబరాల కన్వీనర్ కిషోర్ కంచెర్ల, కోశాధికారి బాపు నూతి తెలిపారు. స్వరవర్షిణి కార్యక్రమంలో శాస్త్రీయ, చలన చిత్ర, మరియు జానపద సంగీతంలో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించి ఆహుతులను మంత్రముగ్దులను చేసారు. “స్వరవర్షిణి కార్యక్రమంలో విజేతలకు రాబోవు అమెరికా సంబరాల వేదికపై విశిష్ఠ కళాకారులతో పాడే సదవకాశం కలుగుతుంది” అని కార్యక్రమ సమన్వయ కర్త రవి తుపురాని తెలిపారు. ఈ పాటల పండుగను చిన్నారులతో పంచుకోవడం, వారికి నేర్పించడం ఒక అపూర్వ అనుభవం అని సాంస్కృతిక సమన్వయకర్త ఆర్య బొమ్మినేని, సహ సమన్వయకర్తలు చాక్స్ కుందేటి, చంద్ర పోట్టిపాటి తెలిపారు. “స్వరవర్షిణి కార్యక్రమంలో పాల్గొనడం ఒక కల అని, ఆ కల సాకారం చేసినందుకు చేయూత నిచ్చిన నాట్స్ సంస్థకు చిన్నారులు, తల్లి దండ్రులు సంబరాల టీం కృతజ్ఞతలు తెలిపింది. స్వరవర్షిణి కార్యక్రమ విజయానికి చాలామంది తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. సాంస్కృతిక విభాగం నుంచి సుజీత్ మంచికంటి, ఉషాలక్ష్మి సోమంచి, విజయ బండి, పల్లవి తోటకూర, రాధిక శైలం, మాధవి ఇందుకూరి, మాధవి లోకిరెడ్డి, శ్రీధర్ వీరబొమ్మ స్వరవర్షిణి కార్యక్రమ విజయానికి చేయూత నిచ్చారు. రిజిష్ట్రేషన్ టీంకు చెందిన శ్రీధర్ విన్నమూరి, ప్రసార మాధ్యమ జట్టుకు చెందిన పవన్ కుమార్ గొల్లపూడి, శరత్ పున్రెడ్డి, వెబ్ జట్టుకు చెందిన శ్రీధర్ న్యాలమడుగుల తమ సహకారం అందించారు. తెలుగు వారందరినీ ఒక వేదికపై కలిసి చిన్నారులకు, యువతకు మన సంస్కృతిని పరిచయం చెయ్యాలని, తెలుగువారి ఐక్యతకు కృషి చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు సంగీతం నేర్చుకోవాలనే తపన చిన్నారులలో నాటుకుపోగలదని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ సంయుక్త సందేశంలో పేర్కొన్నారు. 6వ అమెరికా సంబరాల నాయకత్వం బృందం సభ్యులు కిశోర్ కంచెర్ల (కన్వీనర్), విజయ శేఖర్ అన్నె (కో కన్వీనర్), ఆది గెల్లి (ఉపాధ్యక్షులు), ప్రేమ్ కలిదిండి (ఉపాధ్యక్షులు), రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయవిక్రయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) సంయుక్తంగా స్వరవర్షిణి కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు అభినందనలు తెలియజేసి, తెలుగు వారందరినీ సంబరాలకు ఆహ్వానించారు. కార్యక్రమానికి వార్షిక పోషక దాతలుగా వ్యవహరించిన బావర్చి ఇండియన్ క్విజీన్, శేష గోరంట్ల-రియల్టర్, బిర్యానిస్ అండ్ మోర్, స్పార్కల్స్, అవర్ కిడ్స్ మాంటిస్సొరి, తెరపీ ఫిట్, క్లౌడ్ మెల్లో, శరవణ భవన్, హాట్ బ్రెడ్స్ మరియు సహకరించిన ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Please use left/right arrows (OR) your mouse to navigate through the gallery below….

  • NATS Swaravarshini 2019 Dallas - TNILIVE
  • NATS Swaravarshini 2019 Dallas - TNILIVE
  • NATS Swaravarshini 2019 Dallas - TNILIVE