ఏప్రిల్ 13 న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలు స్థానిక మెడోక్రీక్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 2000కు పైగా ప్రవాసులు పాల్గొన్నారు. సినీ గాయని గీతామాధురి తన పాటలతో ఉర్రూతలూగించారు. పిల్లలకు క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాత్ బౌల్, స్పెల్ మాస్టర్ ఛాలెంజ్ పోటీలలో సుమారు 200 మంది పిల్లలు పోటీపడ్డారు. పొటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి ఉగాది శుభాకాంక్షలతో అందరికి స్వాగతం పలుకగా, తామా కార్యవర్గ సభ్యులు వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియ బలుసు, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్ మరియు బోర్డు సభ్యులు వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, ఆనంద్ అక్కినేని, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, అలాగే గాయని గీతా మాధురి మరియు వ్యాఖ్యాత సమీరా విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అట్లాంటాలోని ప్రముఖ సంగీత మరియు నృత్య పాఠశాలలవారు ప్రదర్శించిన సినిమా నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, ఫాషన్ షో, యాంకర్ సమీరా వ్యాఖ్యానం ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నవారికి ప్రశంసా పత్రాలు అందజేసారు. తామా కార్యవర్గం మరియు బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్, సింగర్ గీతా మాధురి, యాంకర్ సమీరా మరియు జార్జియా హౌస్ ప్రతినిధి టాడ్ జోన్స్ లను పుష్పగుచ్హం, శాలువ మరియు జ్ఞాపికలతో సత్కరించారు. ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆభరణాలు, వస్త్రాలు, ప్రత్యేక ఆహార పదార్దాలు మొదలగునవి విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ సత్యనారాయణ స్వామి గుడి పూజారి రవి మేడిచెర్ల పంచాంగం వివరించారు. ఈ ఉగాది ఉత్సవాలలో ఇండియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వంటకాలతోపాటు షడ్రుచుల ఉగాది పచ్చడి మరియు పెర్సిస్ బిర్యానీ ఇండియన్ గ్రిల్ అందించిన సహపంక్తి భోజనాలు అలరించాయి. ప్రెసిడెంట్ ఎలెక్ట్ భరత్ మద్దినేని కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన వాకిటి క్రియేషన్స్ శ్రీధర్ రెడ్డి, మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడ, వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ ఎలమంచిలి, రాజేష్ జంపాల, రామ్ మద్ది, ఉపేంద్ర నర్రా, శ్రీని బలుసు, విజయ్ కొత్త, విజయ్ కొత్తపల్లి, గిరి సూర్యదేవర, మురళి బొడ్డు, సురేష్ ధూళిపూడి, బాల మడ్డ, అనిల్ కొల్లి, వెంకట్ అడుసుమిల్లి, మహేష్ పవార్, వెంకట్ మీసాల, శ్రీరామ్ రొయ్యల, యశ్వంత్ జొన్నలగడ్డ, హేమంత్ వర్మ పెన్మెత్స, రమేష్ వెన్నెలకంటి, సాన్వి, అక్షు, మోనిష్, తనీష్, రితిక్, రుషీల్, అఖిల్, వంశి కనమర్లపూడి, శ్రీనివాస్ కుక్కడపు, సంతోష్, సరితా, గౌతమి ప్రేమ్, సత్య నాగేందర్, అనిల్, నగేష్ మాగంటి, మూర్తి మొల్లివెంకట, శ్రీనివాస్ గోలి, శ్రీనివాస్ కోడెల, గిరిధర్ కోటగిరి, శశి కేలం, అప్పారావు గోపు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
అట్లాంటాలో ఘనంగా “తామా” వికారినామ ఉగాది వేడుకలు
Related tags :