DailyDose

500మంది జెట్ సిబ్బందిని చేర్చుకున్న స్పైస్‌జెట్-వాణిజ్యం-04/20

500 jet airways employees hired by spicejet

Ø భారత శీతల పానీయాల విపణి దూసుకెలుతుంది. 2021 నాటికి తలసరి వినియోగం రెట్టింపై దాదాపు 84 సీసాలకు చేరొచ్చని పెప్సికో ఇండియా బాట్లింగ్ భాగస్వామి వరుణ్ బెవరేజస్ అంచనా వేస్తోంది

Ø బ్యాంకింగేతర విభాగాల్లోని ఈక్విటీ పెట్టుబడులను విక్రయించే కార్యకలాపాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు వేగవంతం చేశాయి. ఈ కోవలోనే ఆంధ్రా బ్యాంకు కూడా వివిధ సంస్థలనుంచి తన పెట్టుబడులను వెనక్కి తీసుకునే పనిలో నిమగ్నమైంది.ఏ ఎస్ ఆర్ సీ(ఇండియా) లో వాటా విక్రయించటం కూడా ఇందులో ఒకటి

Ø గుడ్ ఫ్రైడే సందర్భంగా నిన్న (శుక్రవారం) బోంబే స్టాక్ ఎక్స్చెంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చంజీ (ఎం ఎస్ ఈ)లు పనిచేయలేదు. బులియన్, ఫారెక్స, మనీ, ఇతర కమోడిటీ మార్కెట్లకు కూడా సెలవే

Ø విజయ్‌ మాల్యా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సామాజిక మాధ్యమం ట్విటర్‌ను వేదికగా చేసుకున్నారు. భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాను బకాయి పడ్డ రుణాలు చెల్లిస్తానని ఒకవైపు చెబుతున్నా, తనపై యూకేలో న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పన్ను చెల్లింపుదార్ల డబ్బును లీగల్‌ ఫీజు కింద యూకేలో వృథా చేస్తోందని ఆరోపించారు.

Ø ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నాన్‌-ఫైలర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎమ్‌ఎస్‌) ద్వారా 2013-17 మధ్య కాలంలో ఐటీ రిటర్నులు సమర్పించని వారిని (2.4 కోట్ల మంది) గుర్తించింది. వీరిలో 25 లక్షల మంది కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో (డ్రాప్డ్‌ ఫైలర్స్‌) రిటర్నులు సమర్పిస్తున్నారు. ఇలాంటి వారిపై జూన్‌ 30లోగా చర్యలు తీసుకోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఐటీ శాఖకు సూచించింది.

Ø 100 మంది పైలట్లు, 200 మంది క్యాబిన్‌క్రూ, మరో 200 మంది సాంకేతిక సిబ్బంది (మొత్తం 500 మంది)ని జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందిని చేర్చుకున్నట్లు స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌ అజయ్‌సింగ్‌ శుక్రవారం వెల్లడించారు.

Ø జెట్‌ నుంచి వసూలు కావాల్సిన రూ.8500 కోట్ల రుణంలో, 80 శాతాన్ని (దాదాపు రూ.7000 కోట్లు) రద్దు చేసుకోవాలని (హెయిర్‌కట్‌) బ్యాంకర్లను పెట్టుబడిదార్లు కోరుతున్నట్లు సమాచారం. అత్యవసర నిధులను బ్యాంకర్లు సమకూర్చకపోవడం వల్లే, కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఫలితంగా సంస్థ విలువ తగ్గిపోతోందని వీరు పేర్కొన్నట్లు తెలిసింది.

Ø సంస్థతో పాటు వేలమంది ఉద్యోగుల భవితను కాపాడేందుకు జెట్‌ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని కోరుతూ ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధానికి లేఖ రాసింది.

*గుడ్‌ఫ్రైడే సందర్భంగా నిన్న (శుక్రవారం) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లు పనిచేయలేదు. బులియన్‌, ఫారెక్స్‌, మనీ, ఇతర కమొడిటీ మార్కెట్లకు కూడా సెలవే.
*ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నాన్‌-ఫైలర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎమ్‌ఎస్‌) ద్వారా 2013-17 మధ్య కాలంలో ఐటీ రిటర్నులు సమర్పించని వారిని (2.4 కోట్ల మంది) గుర్తించింది.
*బ్యాంకింగేతర విభాగాల్లోని ఈక్విటీ పెట్టుబడులను విక్రయించే కార్యకలాపాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు వేగవంతం చేశాయి.
*విజయ్‌ మాల్యా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సామాజిక మాధ్యమం ట్విటర్‌ను వేదికగా చేసుకున్నారు. భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాను బకాయి పడ్డ రుణాలు చెల్లిస్తానని ఒకవైపు చెబుతున్నా, తనపై యూకేలో న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
* భారత శీతల పానీయాల విపణి దూసుకెళ్తోంది. 2021 నాటికి తలసరి వినియోగం రెట్టింపై దాదాపు 84 సీసాలకు చేరొచ్చని పెప్సికో ఇండియా బాట్లింగ్‌ భాగస్వామి వరుణ్‌ బెవరేజెస్‌ అంచనా వేస్తోంది. పళ్ల రసాలు, బాటిల్డ్‌ నీరు ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయని 2018 వార్షిక నివేదికలో సంస్థ పేర్కొంది.
*ఉద్యోగాలు కోల్పోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు, ఉద్యోగులకు చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ భరోసా కల్పించింది. సంస్థ విస్తరణలో భాగంగా అనేక మందిని నియమించుకుంటామని వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్‌వేస్‌ సిబ్బందికి నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్‌ వెల్లడించారు.
*గత కొంతకాలంగా ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీతో సహా పలువురిపై విమర్శలు గుప్పిస్తున్న ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యా ఈసారి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)పై విమర్శనాస్త్రాలు సంధించారు.
*జెట్‌ విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన కారణంగా ఆ విమానాలను తమకు లీజుకు ఇవ్వాలంటూ ఎయిర్ ఇండియా ఛైర్మన్‌ అశ్విని లోహాని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌కు లేఖ రాశారు. గత కొంత కాలంగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం అన్ని విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.