Fashion

అడిడాస్ నుండి వెలిగే బూట్లు

adidas night joggers shoes releaseing in india

తెల్లవారుజామున జాకింగ్‌ చేస్తూ ప్రమాదాలకు గురైన ఘటనలు ఇటీవల మనం వింటూనే ఉన్నాం. చీకట్లో రోడ్డు పక్కన పరుగెత్తే వాళ్లు, రోడ్డు దాటేవాళ్లు కన్పించక డ్రైవర్లు వాహనాలను అలాగే నడిపేస్తుంటారు. దీంతో ప్రమాదాలు తప్పడం లేదు. ఇక మీదట ఇలా జరగకుండా అడిడాస్‌ లైటింగ్‌ షూను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ షూ ఎంతో మంచి లుక్‌తో యూత్‌ని ఆకట్టుకోవడంతో పాటు… లైట్‌వెయిట్‌తో అలరిస్తున్నాయి. పాదాలకు గాలి ఆడటానికి మెష్‌ ఏర్పాటు వీటి ప్రత్యేకత. దగ్గరలోని కాంతిని ఈ షూలోని ప్రత్యేక ప్రదేశాలు గ్రహించి చీకట్లో మెరుస్తూ ఉంటాయి. దీంతో చీకట్లో అయినా ఎవరో నడుస్తున్నట్లు దూరంగా ఉన్నవారికి కన్పిస్తుంది. 1980ల్లో ఇలాంటి షూని అడిడాస్‌ తయారుచేసింది. అయితో అప్పుడు సోల్‌లో బ్యాటరీ పెట్టి చిన్న లైట్‌ వెలిగేలా ఏర్పాటుచేశారు. కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన ‘అడిడాస్‌ నైట్‌ జాగర్స్‌’ వీధిదీపాలు, ఏదైనా లైటింగ్‌ సోర్స్‌ నుంచి కాంతిని తీసుకొని ప్రకాశిస్తాయి. లేస్‌, పట్టీలు, సోల్‌లోని కొన్ని ప్రదేశాలు ఇలా మెరుస్తూ రాత్రుల్లో షూస్‌కి మరింత అందమిస్తాయి. ఏప్రిల్‌ 11 నుంచి భారత మార్కెట్లోకి అడిడాస్‌ ఈ షూని విడుదల చేసింది.