NRI-NRT

నేరాన్ని అంగీకరించిన ఆకుతోట విశ్వనాథ్-పదేళ్లు జైలుశిక్ష

akuthota vishwanath pleads guilty faces 10 years in prison

కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా చెడగొట్టానని అంగీకరించిన భారతీయ విద్యార్థికి అమెరికా కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం కనిపిస్తోంది. న్యూయార్క్‌ రాష్ట్రం రాజధాని అల్బనిలోని సెయింట్‌ లూయిస్‌ కళాశాలలో గల కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా చెడిపోయేలా చేసినట్లు విశ్వనాథ్‌ ఆకుతోట(27) అనే భారతీయ విద్యార్థి అంగీకరించాడని అమెరికా అటార్నీ గ్రాంట్‌ జాక్విత్‌ తెలిపారు. ఆగస్టులో కోర్టు శిక్ష ఖరారు చేయనుందని చెప్పారు. ఇతడికి పదేళ్ల జైలుశిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. జైలు నుంచి విడుదలైన మూడేళ్లవరకు ఇతనిపై దర్యాప్తు సంస్థలు ఓ కన్నేసి ఉంచనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న 66 కంప్యూటర్లు, మరికొన్ని కంప్యూటర్‌ మానిటర్లు, కంప్యూటర్ల పనితీరును పెంచే పోడియంలలో ‘‘యూఎస్‌బీ కిల్లర్‌’’ అనే ఉపకరణాన్ని ప్రవేశపెట్టాడు. ఫలితంగా 50కిపైగా కంప్యూటర్లు చెడిపోయాయి. ఈ తతంగాన్ని తన ఐఫోన్‌లో చిత్రీకరించాడు. కళాశాలకు 58,470 డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టపరిహారం చెల్లించడానికి విశ్వనాథ్‌ అంగీకరించాడు.