బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న ‘మెంటల్ హై క్యా’ సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలంటూ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (ఐపీఎస్) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ని కోరింది. టైటిల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని వల్ల సమస్యలు ఎదురవుతాయని, ఇది మెంటల్ హెల్త్ కేర్ చట్టంలోని (2017) పలు సెక్షన్లను ఉల్లంఘించడమేనని లేఖలో పేర్కొంది. ఇలాంటివి భవిష్యత్తులో కూడా జరగకుండా చట్టపరంగా హెచ్చరిస్తున్నామని తెలిపింది. పలువురు మానసిక వైద్యులు, నిపుణులు ఈ మేరకు చిత్ర బృందాన్ని విమర్శించారు. మానసిక రోగుల్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. టైటిల్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. మరి దీనికిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ‘మెంటల్ హై క్యా’ సినిమాలో రాజ్ కుమార్ రావు, అమైరా దస్తూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. జూన్ 21న సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
మెంటల్‌కు చట్టనిబంధనాలు
Related tags :