* ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వాయనాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ఆమె ప్రచారానికి విచ్చేశారు. తన సోదరుడి గురించి చెబుతూ, “నేను ఒక చెల్లెలుగా మీ ముందుకు వచ్చాను, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మా అన్నయ్య ప్రజలకోసం నిలబడ్డారు” అంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. “ఆయన విద్యార్హతలను ప్రశ్నించారు, అమరుడైన తండ్రిని ఓ దొంగ అని నిందించారు, దశాబ్దకాలంగా ఆయనపై రకరకాలుగా దాడులు చేశారు, అయినా అన్నింటిని తట్టుకుని ఎదిరించి నిలిచారు” అంటూ రాహుల్ ను కీర్తించారు. ఇక బీజేపీపైనా విమర్శలు చేశారు. ప్రతి రాష్ట్రమూ దేశంలో అంతర్భాగం, కానీ బీజేపీ ఈ ఐదేళ్లలో చేసింది ఏమిటంటే దేశాన్ని ముక్కలు చేయడం, ప్రజలను విభజించడమేనంటూ ధ్వజమెత్తారు. కేరళ, తమిళనాడు, యూపీ, గుజరాత్ అన్నీ దేశంలో భాగమేనని, కానీ బీజేపీ తన పాలనలో ప్రజల మధ్యన చీలిక తెచ్చిందని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా బీజేపీ నేతలు నెరవేర్చలేదని ఆరోపించారు. “రైతుల ఆదాయాన్ని పెంచేస్తామని చెప్పారు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు, నిరుద్యోగుల కోసం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు… వీటిలో ఏ ఒక్కటైనా జరిగిందా?” అని ప్రియాంక నిలదీశారు
* ఐటీ గ్రిడ్ కేసులో కీలక మలుపు. ఐటీ గ్రిడ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి ఏపీ, తెలంగాణ, పంజాబ్‌తోపాటు మరో రెండు ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన ప్రజల ఆధార్ డాటా లభ్యమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
* సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు 69వ పుట్టిన రోజును టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దఎత్తున జరుపుతున్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
* పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల నమ్మకాన్ని ఆమె తుంగలో తొక్కి, ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ దీనాజ్‌పూర్‌లోని బునియాద్‌పూర్‌లో శనివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మమత బెనర్జీ రాష్ట్రాభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ అని పునరుద్ఘాటించారు.
* ఏపిలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా వెలువడిన తరువాత ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి.. ఫలితాల పై పార్టీలు ధీమాగా ఉన్నాయి. మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం లోగానే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్ చేశారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 69వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
*వ్యాపారులపై మోదీ వరాల జల్లు
ఎన్నికల వేళ ప్రధాని మోదీ వ్యాపార వర్గాలపై హామీల జల్లు కురిపించారు. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండానే రూ.50 లక్షల రుణాలు ఇప్పిస్తామని ప్రకటించారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని, చిరువ్యాపారులకు పింఛను పథకం ప్రవేశపెడతామని వెల్లడించారు. దిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో వ్యాపారులతో శుక్రవారం నిర్వహించిన సదస్సులో మోదీ మాట్లాడారు.
*మోదీ నాయకత్వం దేశానికి అవసరం
ఉగ్రవాదం, వేర్పాటువాద శక్తులపై ఉక్కుపాదం మోపి దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే సాధ్యమైందని, అందుకే ప్రజలు మరోసారి ఆయన నాయకత్వం కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఒడిశా రాష్ట్రం మయూరభంజ్ జిల్లాలోని కరంజియా, బాలేశ్వర్‌లలో నిర్వహించిన విజయసంకల్ప సభల్లో పాల్గొని ప్రసంగించారు.
*ఇప్పటికైనా తప్పుడు లెక్కలు మానండి
వైకాపా నేత విజయసాయిరెడ్డి లెక్కలు తప్పుతున్నాయని జనసేన విశాఖ లోక్‌సభ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి సీఏ చదివినా కూడా లెక్కలు ఎలా తప్పుతున్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. వైకాపానేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై లక్ష్మీనారాయణ శుక్రవారం ట్వీటర్‌లో ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘జనసేన సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లు కాగా.. 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జేడీ లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నారు. లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన కేసుల్లోనూ ఇలాగే లేనివి ఉన్నట్టు రాశారు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’’ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన లక్ష్మీనారాయణ ‘‘మీ లెక్కలు సరి చూసుకోండి. ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పని చేసే వాళ్లం. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతో మంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలు పెట్టండి. జనసేన పోటీ చేసింది 140 స్థానాలు. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఐ, సీపీఎంలు 14 స్థానాల్లో పోటీ చేశాయి. మొత్తం 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు కచ్చితంగా ఉంటాయి’’ అంటూ సమాధానమిచ్చారు.
*అజంలాంటి వారికోసం రోమియో వ్యతిరేక స్క్వాడ్
మా ప్రభుత్వం అజంలాంటి వారికోసం రోమియో వ్యతిరేక స్క్వాడ్‌ను సిద్ధం చేసింది. రామ్‌పుర్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ జీవి ఉంది. అంబేడ్కర్ గురించి ఎలాంటి భాష వాడిందో తెలుసా?. అంబేడ్కర్‌ను అవమానించినవారి కోసం ఈరోజు మాయావతి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. యూపీలో ఇప్పటివరకు జరిగిన మొదటి రెండుదశల ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీలకు ఒక్కసీటు కూడా రాదు.
*బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా?
బీసీని కాబట్టే తనపై విమర్శలు చేస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో గుర్తుకురాని బీసీలు ఎన్నికల ముందు గుర్తొచ్చారా? అని నిలదీశారు. ప్రధాని స్థాయిలో ఉండి కులాలు, మతాల ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటని, గత ప్రధానుల్లో ఒక్కరు కూడా ఇలా మాట్లాడలేదని శుక్రవారం ఓ ప్రకటనలో ఆమె మండిపడ్డారు. 1984లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో మోదీ కీలకపాత్ర పోషించారని, అలాంటి వ్యక్తికి బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని తెలిపారు.
*బెంగాల్‌లో భాజపాకు ఈసారి పెద్ద ‘రసగుల్లా’నే
2014లో లడ్డూలు తిన్నవాళ్లు చాలా బాధ పడ్డారు. బెంగాల్‌లో భాజపాకి రెండే లోక్‌సభ సీట్లు వచ్చాయి. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో వారికి పెద్ద రసగుల్లా దక్కనుంది. పెద్ద సున్నా వస్తుంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, బెంగాల్‌లో భాజపా ప్రభుత్వం అనే రెండు లడ్డూలను రాష్ట్రప్రజలకు కానుకగా ఇస్తామన్న ప్రధాని మోదీ హామీని ఎన్నటికీ నిలబెట్టుకోలేరు.
*తొలుత ఎంపీటీసీ ఓటు.. తర్వాత జడ్పీటీసీ
పరిషత్ స్థానాలకు పోలింగ్ రోజున ఓటరు తొలుత ఎంపీటీసీ అభ్యర్థికి ఓటు వేసి.. తర్వాత జడ్పీటీసీ బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి దానిపైనా ఓటు ముద్రను వేయాలి. అంతే తప్ప పోలింగ్ అధికారులు రెండు బ్యాలెట్ పత్రాలను ఓటరుకు ఒకేసారి ఇవ్వకూడదు. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 11వ తేదీన ఎడమ చేతి చూపుడువేలుపై వేసిన సిరా గుర్తు ఇంకా అలాగే ఉన్నందున ఇప్పుడు పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున ఎడమ చేతి మధ్య వేలుపై సిరా గుర్తును వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నిర్ణయించింది.
*కాంగ్రెస్‌ను వీడిన ప్రియాంక చతుర్వేది
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల కన్వీనర్ ప్రియాంక చతుర్వేది ఆ పార్టీని వీడి శుక్రవారం శివసేనలో చేరారు. తనపట్ల అనుచితంగా వ్యవహరించి సస్పెన్షన్‌కు గురైన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబయిలో శివసేన అధ్యక్షుడు ఉద్ధావ్ ఠాక్రే సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరారు. ‘రఫేల్’పై దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని రాహుల్‌గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు ఆమె గత ఏడాది సెప్టెంబరులో ఉత్తరప్రదేశ్‌లోని మథురలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ప్రధాని మోదీని గద్దె దించాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం కర్ణాటకలోని రాయచూరు, చిక్కోడిల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ అధికారంలోకి వస్తుంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
*ఆర్టికల్ 370ను రద్దు చేసి తీరుతాం
పార్లమెంటులోని లోక్‌సభ, రాజ్యసభల్లో మాకు మెజార్టీ వస్తే జమ్మూకశ్మీరుకు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేసి తీరుతాం. తద్వారా ఆ రాష్ట్రం భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగమవుతుంది. మోదీ అధ్యక్షతన దేశాభివృద్ధి జరుగుతోందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానాంశం జాతీయభద్రత. మోదీ, భాజపా మాత్రమే అది కల్పించగలరు. భారత్‌ను మోదీ మాత్రమే సూపర్ పవర్ చేయగలరు.
*ఐటీ దాడులు రాజకీయ ప్రతీకారం కాదు: మోదీ
ఇటీవల కొందరు రాజకీయ నాయకులపై ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం దాడులు చట్టప్రకారమే జరిగాయని, రాజకీయ ప్రతీకారంతో ఎంతమాత్రం భాగం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఒక మతం మొత్తాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టిన వారికి ప్రజ్ఞా సింగ్ అభ్యర్థిత్వం దీటైన జవాబు అని అన్నారు. భోపాల్ నుంచి భాజపా తరఫున లోక్‌సభకు పోటీపడుతున్న ఆమె కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వగలదన్నారు. ‘‘టైమ్స్ నౌ’’ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
*అజంలాంటి వారికోసం రోమియో వ్యతిరేక స్క్వాడ్
మా ప్రభుత్వం అజంలాంటి వారికోసం రోమియో వ్యతిరేక స్క్వాడ్‌ను సిద్ధం చేసింది. రామ్‌పుర్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ జీవి ఉంది. అంబేడ్కర్ గురించి ఎలాంటి భాష వాడిందో తెలుసా?. అంబేడ్కర్‌ను అవమానించినవారి కోసం ఈరోజు మాయావతి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. యూపీలో ఇప్పటివరకు జరిగిన మొదటి రెండుదశల ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీలకు ఒక్కసీటు కూడా రాదు.
*పార్టీ మారిన ఎమ్మెల్యేలపై లోక్‌పాల్‌లో ఫిర్యాదు
ప్రజాభీష్టానికి భిన్నంగా, ప్రలోభాలకు గురై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ తెలిపారు. తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధైర్యముంటే రాజీనామా, ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కోట్ల రూపాయలు, విలువైన స్థలాలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రూపంలో అవినీతి రాజ్యమేలుతోందని మానవతారాయ్ విమర్శించారు.
*ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానం మొదలుపెట్టండి
వైకాపా నేత విజయసాయిరెడ్డి లెక్కలు తప్పుతున్నాయని జనసేన విశాఖ లోక్‌సభ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి సీఏ చదివినా కూడా లెక్కలు ఎలా తప్పుతున్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. వైకాపానేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై లక్ష్మీనారాయణ శుక్రవారం ట్విటర్‌లో ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘జనసేన సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లు కాగా.. 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జేడీ లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నారు. లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన కేసుల్లోనూ ఇలాగే లేనివి ఉన్నట్టు రాశారు.
*ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్
జయలలిత నెచ్చెలి శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ‘అమ్మా మక్కళ్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జయలలిత మరణానంతరం అధికార అన్నాడీఎంకేలో చీలికలు వచ్చినప్పుడు టీటీవీ దినకరన్ సారథ్యంలో ఈ పార్టీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలులో ఉన్న శశికళ ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉండగా… టీటీవీ దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. చెన్నైలో శుక్రవారం జరిగిన సమావేశంలో దినకరన్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏఎంఎంకేను రాజకీయ పార్టీగా నమోదు చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
*ప్రధాని వింత వ్యాధితో బాధపడుతున్నారు
ప్రధాని నరేంద్రమోదీ ఓ రకమైన వింత వ్యాధితో బాధపడుతున్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి విమర్శించారు. మోదీ ఆలోచన, పనితీరు, ప్రవర్తనా విచిత్రంగా ఉంటుందని, మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ… ఇంకా తనను తాను చాయ్‌వాలా, కాపలాదారుగా ఊహించుకుంటున్నారన్నారు. మోదీకి సరైన వైద్య పరీక్షలు చేయించి చికిత్స అందించేలా భాజపా చొరవ తీసుకోవాలన్నారు.