భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైబర్ వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆయన పేరుతో ఓ నిందితుడు ఫేస్బుక్ ఖాతా ప్రారంభించాడు. మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా మరో ఫేస్బుక్ ఖాతాలో పోస్టులు పెడుతున్నారు. వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఈ నెల 15న ముంబయిలో భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసిన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ సన్నిహితులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివరాలను ఆయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఉన్నతాధికారులకు తెలిపారు. హైదరాబాద్కు వచ్చాక శుక్రవారం సాయంత్రం పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఒక ఫేస్బుక్ ఖాతాలో తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లే అంశాలున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని కోరారు. దాంతో పోలీసులు వెంటనే స్పందించి ఆ ఫేస్బుక్ ఖాతాలో ఇతరత్రా పోస్టులు ఉంచకుండా చర్యలు చేపట్టారు.
ఏకంగా నకిలీ ఖాతాలతో డబ్బుల వసూలు దందా
Related tags :