Devotional

దీపారాధన ఉత్తమ భక్తి మార్గం

oil lamp is best way of worship

దీపం జ్ఞానానికి ప్రతీక. అజ్ఞాన తిమిరాలను పారదోలే తేజస్సు. అలాగే, భగవంతుడు జ్యోతిస్వరూపుడు. భారతీయ సంప్రదాయంలో దీపం వెలిగించడానికి ఎంతో విశిష్ఠత ఉంది. ప్రతీరోజు ఇండ్లలో పొద్దున, సాయంకాలం, పూజకు ముందు, గుడికి వెళ్లిన తర్వాత దీపారాధన చేస్తాం. ఇంకొందరు అఖండ దీపాలు వెలిగిస్తుంటారు. అవి ఎప్పటికీ అలా ఆరకుండా వెలుగుతూనే ఉంటాయి. కరంటు సదుపాయం వచ్చిన తర్వాత సాయంకాలం చీకటి పడగానే లైట్ వేసి ఇక, అదే దీపం అనుకొని, దీపారాధన అయిందని, దానికే నమస్కరించే వారుంటారు. కానీ, చమురు దీపాలు వెలిగించడం, అదీ దేవుడి ముందు లేదా పూజగదిలో లేదా ప్రధాన ద్వారానికి ఎదురుగా వెలిగించడమే మన సత్సంప్రదాయం. ఒకటే దీపం వెలిగించవద్దు. రెండు దీపాలు, రెండేసి వత్తులతో వెలిగించడమే మంచిదని పండితులు అంటారు. రాత్రిపూట హఠాత్తుగా కరంటు పోయిందనుకోండి, అప్పుడు దేవుడి ముందు వెలిగించిన దీపకాంతులు పరిసరాల చుట్టూ పరచుకొంటాయి. అలాగే, పిల్లల పుట్టిన రోజు సందర్భంలో కొందరు కొవ్వొత్తి దీపాలను ఆర్పుతుంటారు. ఇదీ పొరపాటు. మనది దీపాలను వెలిగించే సంప్రదాయమే కానీ, ఆర్పే సంస్కారం కాదు. ప్రతి రోజూ పొద్దున, సాయం సంధ్యా వేళ రెండుసార్లు దేవుని ముందు దీపాలు వెలిగించడం ఉత్తమ లక్షణం.