ScienceAndTech

అంతరిక్షంలో ఏడాది రికార్డు

christina koch to make world record by being the women in space for longer duration

క్రిష్టినా కోచ్.. నాసా 2013 బ్యాచ్‌కు చెందిన మహిళా వ్యోమగామి. మార్చి 14న ఇంటర్నేషన్‌లో స్పేష్ స్టేషన్‌కు చేరింది. షెడ్యుల్ ప్రకారం ఆరు నెలల అక్కడ కక్ష్యలో ఉండి పరిశోధన చేయాలి. కానీ నాసా ఇటీవల ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం ఆమె అదనంగా ఆర్నెళ్లు అంతరిక్షంలో గడపబోతుంది. 2020 ఫిబ్రవరి నెలలో ఆమె తిరిగి భూమి మీదకు వస్తుంది. ఈ మేరకు నాసా ఆమె అంతరిక్ష యాత్రను పొడగించింది. ఈ వ్యవధి కొత్త రికార్డుకు నాంది పలుకనుంది. ఇంతకు ముందు ఉన్న పిగ్గి విట్సన్ వ్యోమగామి రికార్డును క్రిష్టినా ఛేదించబోతుంది. పిగ్గివిట్సిన 288 రోజులు అంతరిక్షంలో సుదీర్ఘంగా గడిపాడు. ఇప్పుడు క్రిష్టినా దాదాపు యేడాది పాటు ఉండి ఆ రికార్డును అధిగమించనుంది. నాసా ప్రకటన తర్వాత క్రిష్టినా స్పేష్ సెంటర్ నుంచి అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏడాది కాలం నేను రోజులు లెక్కపెట్టకుండా ఉంటానని, ప్రతి నిమిషాన్ని పరిశోధన కోసం వినియోగించుకుంటానని తెలిపింది. క్రిష్టినా తిరిగి భూమి మీదకు చేరుకున్న తర్వాత ఆమె శరీరంలో మార్పులు, అక్కడి వాతావరణ ప్రభావం వంటి అంశాలపై పరీక్షలు చేయనున్నట్టు నాసా తెలిపింది.