కోస్తా, రాయలసీమల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది. రెండురోజుల క్రితం ప్రారంభమైన వర్షాలు మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలు కొన్ని రోజులుగా ఎండ తీ వ్రతకు వేడెక్కాయి. ఇదే సమయంలో ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి, ఉత్తర కర్ణాటకలో ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డాయి. వీటి కారణంగా సముద్రం నుంచి తేమగాలులు రావడంతో తె లుగు రాష్ట్రాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు సంభవించాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోని అనంతగిరి మండలంలో వడగళ్లు పడ్డాయి. గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
Related tags :