ఈకామర్స్ సంస్థ ఇండియామార్ట్ మరో రెండేళ్లలో ఐపీవోకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది. దీనికి తగ్గట్లే దాదాపు కాంపౌండ్ యాన్యూవల్ గ్రోత్ రేట్‌ను కొనసాగించేలా చూస్తోంది. మరో రెండేళ్లపాటు ఇదే జోరు కొనసాగించి ఐపీవోకు రావాలని ఈ కంపెనీ భావిస్తోంది. తాజాగా ఈ కంపెనీ 2018-19 సంవత్సరానికి రూ.429కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. దీనిలో నిర్వహణ లాభం రూ.46 కోట్లు. ‘గత మూడేళ్లుగా మా ఆదాయం ఏటా 29శాతం లెక్కన పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదే పెరుగుదలను నమోదు చేస్తాము.’ అని ఇండియా మార్ట్ సీఈవో దినేష్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మేము ఇప్పటికే ఇండియామార్ట్‌లో దాదాపు 5 కోట్ల వస్తువుల వివరాలు, ఐదులక్షల సరఫరాదారుల వివరాలను నమోదు చేశాము. మా వాటిల్లోనమోదైన అన్ని సంస్థలు చిన్న,మధ్యశ్రేణివి.ఇప్పుడు మేము పెద్ద సంస్థలను కూడా ఇండియామార్ట్‌లో అందుబాటులోకి తీసుకొస్తాము. ఐపీవోలో మా కంపెనీ దాదాపు రూ.3,250 కోట్లను సమీకరిస్తుందని అంచనా వేస్తున్నాం.’’ అని అగర్వాల్ తెలిపారు.
స్టాక్‌మార్కెట్లోకి ఇండియామార్ట్
Related tags :