బాలనటిగా సినీ కెరీర్‌ను ప్రారంభించి, టాప్ హీరోయిన్ అనిపించుకున్నారు శ్రీదేవి. అటు గ్లామర్ పాత్రలతో పాటు, ఇటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనూ నటించారు. అంతేకాదు, అలనాటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో నటించిన శ్రీదేవి ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతోనూ ఆడి పాడి అలరించారు. అయితే ఎన్నో గొప్ప పాత్రలు చేసిన శ్రీదేవికి ఓ కోరిక మాత్రం తీరలేదు. ‘‘నేను చాలా పాత్రలు ధరించాను కానీ, ‘దేవదాసు’లోని పార్వతి, ‘లైలామజ్ను’లోని లైలా పాత్రలు చెయ్యాలని ఎంతో కోరిక. నేను చాలా చిత్రాలు చూశాను కానీ, ‘షర్మిలీ’లోని రాఖీ చేసిన ద్విపాత్రాభినయం బాగా ఆకట్టుకుంది. ఒక్కోసారి మంచిపాత్ర చెయ్యిజారిపోయినప్పుడు బాధపడతాను. భారతీరాజా, ‘కిళెక్కే పోగుం రైలు’ తీసినప్పుడు అందులోని నాయిక పాత్రకి నన్ను అడిగారు. 20 రోజులు అవుట్‌డోర్‌లో ఉండాలన్నారు. అప్పుడు నాకున్న కమిట్‌మెంట్స్‌తో కుదరక, ‘సారీ’ చెప్పాను కానీ, మంచిపాత్ర తప్పిపోయిందని బాధపడ్డాను. ఆ పాత్రనాకు రాకపోవడం మంచిదే అయింది. రాధికలాంటి నటికి ప్రవేశం లభించి, గొప్పనటి దొరికిందనిపించింది’’ అని ఓ సందర్భంలో చెప్పారు!
కోరిక తీరకుండానే…
Related tags :