NRI-NRT

తానా-డీటీఏ ఆధ్వర్యంలో తొలిసారిగా చిత్రలేఖనం పోటీలు

tana detroit telugu association conducts drawing competitions for washington dc tana telugu 2019 convention

తానా డీసీ 2019 మహాసభల సందర్భంగా డెట్రాయిట్ తెలుగు సంఘం సహకారంతో డెట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర హిందూ దేవాలయంలో తొలిసారిగా స్థానిక ప్రవాస చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 4-6, 7-10, 11-14ఏళ్ల వయోవిభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

*** 4-6 విభాగం: ప్రథమ – సంగపల్లి ఆగ్రత, ద్వితీయ – వైష్ణవి, తృతీయ – దుగ్గిరాల పూర్వీ

*** 7-10 విభాగం: ప్రథమ – బచ్చు సుభాష్, ద్వితీయ – కర్రల విరూజ్ఞ, తృతీయ – ఈషా హరీష్

*** 11-14 విభాగం: ప్రథమ – జింగిలిపాలెం శాన్వి, ద్వితీయ – నల్లారి అనీష్, తృతీయ – సూర్యదేవర శ్రద్ధ

మహాసభల సందర్భంగా చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, 23మంది చిన్నారులు ఉల్లాసంగా ఈ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉనందని తానా మిషిగన్ ప్రాంతీయ ప్రతినిధి పంత్ర సునీల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను తానా ప్రతినిధులు దుగ్గిరాల కిరణ, వెలగా శుభాకర్, కారుమంచి వంశీ, పెద్దిబోయిన జోగేశ్వరరావు, డెట్రాయిట్ తెలుగు సంఘం ప్రతినిధులు బచ్చు సుధీర్, గడ్డం శుభ్రత, మారుపూడి జ్యోతి, బొప్పన ద్వారకాప్రసాద్, ఉప్పలపాటి నరసింహారావు, జుజ్జువరపు శివ, ఆత్మకూరి సంతోష్, శిరీష ప్రతాప తదితరులు పర్యవేక్షించారు.