Health

మీ ఆఫీసు ప్రయాణం మీ గుండెను చిదిమేస్తోంది

tarffic is killing peoples hearts and causing health issues

గుండెజబ్బు ముప్పు కారకాలు అనగానే తగినంత వ్యాయామం చేయకపోవటం, కొవ్వు పదార్థాలు మితిమీరి తినటం వంటివే గుర్తుకొస్తాయి. కానీ చిత్రంగా అనిపించినా ట్రాఫిక్‌ రద్దీ కూడా గుండెపోటు ముప్పు పెరగటానికి దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఒత్తిడి పెరిగిపోవటం దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. వాహనాల భారీ చప్పుళ్లు సైతం గుండెజబ్బు ముప్పు పెరగటానికి దారితీస్తున్నాయి. అందువల్ల రద్దీ వేళల్లో ప్రయాణాలు పెట్టుకోకపోవటం మంచిది. ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే ఒత్తిడి తగ్గించే సాధనాలు వెంట ఉండేలా చూసుకోవాలి. వాహనం ఆగిపోయినపుడు బంతిని చేత్తో నొక్కొచ్చు. మంచి సంగీతం వినొచ్చు.