ఏకకాలంలో 2 యూనివర్సిటీల్లో ఉద్యోగం చేసినందుకు లండన్లో తెలుగు ప్రొఫెసర్ న్యాయ విచారణను ఎదుర్కొంటున్నారు. 2015 సెప్టెంబరు నుంచి 2016 నవంబరు వరకు అఖిలేశ్ రెడ్డి అనే తెలుగు ప్రొఫెసర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ లండన్లో(యూసీఎల్) పూర్తిస్థాయి ఉద్యోగిగా పనిచేశారని ద టైమ్స్ వెల్లడించింది. ఈ విషయం బయటపడటంతో ఆయనపై యూకే మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రైబ్యునల్ సర్వీసు విచారణ చేపట్టింది. నిద్రకు సంబంధించిన సమస్యలపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. శరీరంలోని ఎర్రరక్త కణాలకు వాటి సొంత వేళలు(బాడీ క్లాక్స్) ఉంటాయని కనుగొన్నారు.
లండన్లో ప్రొ.అఖిలేష్రెడ్డిపై కేసు
Related tags :