NRI-NRT

మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వరయంలో ఉగాది వేడుకలు

ugadi 2019 in malaysia by malaysia telugu foundation

మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF) ఆధ్వర్యములో వికారి నామ సంవత్సర ఉగాది 2019 వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సెలంగూర్ స్టేట్ కౌన్సిలర్ గణపతిరావు, మలేషియా ఇండియా హై కమిషన్ కౌన్సిలర్ నిషిత్ ఉజ్వల్ పాల్గొన్నారు , ఈ సందర్బంగా ప్రముఖ ప్రఖ్యాత గాయకుడు నాగూర్ బాబు ()మనో) మరియు అతని బృందం హరిణి, సాయిచరణ్, అరుణ్, సాహితి, శ్రీకాంత్ తదితరులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. మనో గారు మాట్లాడుతూ విదేశాలలో కూడా మన తెలుగు పండగలు సంస్కృతీ సంప్రదాయాలతో నిర్వహిస్తూ తెలుగూ భాషా మరియు తెలుగు వారి ఉనికి కాపాడుతున్న దాతో కాంతారావు గారిని మరియు ప్రకాష్ గారిని అయన అభినందించారు. ఈ కార్యాక్రమములో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ MTF ప్రెసిడెంట్ దాతో కాంతారావు గారు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ఈవెంట్ ద్వారా సేకరించిన విరాళాలని చారిటబుల్ ట్రస్ట్ లకి అందజేశారు. జాతిపిత మహాత్మా గాంధీజి గారి 150 వ జన్మదినం కావున వారి జ్ఞాపకార్థం గాంధీ పైన వీడియో ప్రెసెంటేషన్, మరియు చిన్న స్కిట్ చేసి అందులో పాల్గొన్న వారికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రములో MTF ప్రెసిడెంట్ దాతో కాంతారావు ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ , మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి గారు , PKKTM అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు, TAM వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణరావు, పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, తెలుగు ఇంటెలెక్చవల్ సొసైటీ ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు,ఒకే కుటుంబం ప్రెసిడెంట్ అప్పన్ననాయుడు పాల్గొన్నారు.

via GIPHY