దుర్వాస మహర్షి తన భార్య అయిన ‘ కదళి ‘ తో ఒక పర్ణశాలలో నివశిస్తూ , జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కోపం ఎక్కువ .అందువల్ల ‘కదళి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురికాకుండా ఉంటుండేది. ఒక సాయంసంధ్యా కాలంలో దుర్వాసమహర్షి ఎంతో అలసటగా ఉండటాన పర్ణశాల బయటి అరుగుపై నడుంవాల్చాడు. వెంటనే గాఢనిద్రలోకి జారుకున్నాడు. ఆయన అర్ధాంగి అయిన ‘ కదళి ‘ ఎంతో సేపు ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి, సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో , ఆయన్ను లేపడంతన కర్తవ్యంగా భావించి , ఆదమరచి నిద్రిస్తున్న దుర్వాసుని తట్టి నిద్రలేపింది.నిద్రాభంగం కలిగినందున పరమకోపిష్టి ఐన ఆయన పట్టలేని ఆగ్రహంతో , కళ్ళుతెరచి భార్యను చూశాడు. ఆయన నేత్రాలనుండీ వెలువడిన అగ్నిజ్యాలలకు ఆమె భస్మమైపోయింది. ముందువెనుకలు ఆలోచించక తాను కోపం తెచ్చుకోడం వలన జరిగిన అనర్ధానికి దుర్వాసుడెంతో పశ్చాత్తపపడ్డాడు. చేసేదేంలేక మౌనంగా ఉండిపోయాడు.ఐతే కొన్నిదినాల తర్వాత దుర్వాసుని మామగారు, తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు. ఆయన తన కుమార్తె గురించీ అడగ్గా, దుర్వాసుడు మామగారు తనకు శాపమిస్తాడనే భయంతో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి, క్షమించమని కోరి, తన తపోశక్తితో ఆభస్మం నుండీ , ఒకచెట్టును సృష్టించాడుట. అదే కదళీ వృక్షం ,అంటే అరటిచెట్టు.దుర్వాసుడు తన మామగారితో మీ కుమార్తె కదళి అందరికీ ఇష్టురాలై’ కదళీఫలం రూపంలో అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదనకే కాక, మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ , నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రాముఖ స్థానంలో ఉండి గౌరవం పొందుతుందని వరమిచ్చాడుట!ఆ కదళీ ఫలాన్ని [ అరటి పండును] మనం కడిగి దేవుని ముందుంచి కొద్దిగా తొక్క తీసి కదళీఫలం సమర్పయామి అంటూ నివేదన చేస్తాం.
1.తితిదే అత్యుత్సాహం
బంగారం డిపాజిట్ చేసే విషయంలో తితిదే అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ధర్మకర్తల మండలి అనుమతి తీసుకోకుండా డిపాజిట్ చేయడం పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు ద్రవ్యనిధి పధకం కింద పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,311 కిలోల బంగారాన్ని 1.75 శతం వడ్డీరేటు పై తితిదే డిపాజిట్ చేసింది. డిపాజిట్ కాల వ్యవధి మూడేళ్ళు ఈనెల 18న కాలపరిమితి ముగిసింది. అంతకుముందే మరోసారి దిపజిత్క్ ఉ అవకాశం ఇవాలని బ్యాంకు అధికారులు కోరారు. తొలుత తితిదే అధికారులు కోరారు. తొలుత తితిదే అధికారులు అంగీకరించి ఆ తరువాత కొనసాగించడం కుదరదని బంగారం వడ్డీ కింద మరో 70 కిలోలను స్విట్జర్లాండ్ లో కొనుగోలు చేసి పీఎన్బీ తిరుపతిలో తితిదే ఖజానాకు అందజేసేలా విక్రయదరులతో ఒప్పందం చేసుకుంది. స్విట్జర్లాండ్ నుంచి చెన్నైకి దిగుమతి అయిన బంగారం తిరుపతికి తరలిస్తుండగా ఎన్నికల సంఘం పట్టుకోవడం సంచలమైంది.
2.ముగిసిన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
కడప జిల్లా ఏకశిలానగరి కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఒంటిమిట్ట రామయ్య క్షేత్రంలో ఉదయం చక్రస్నానం కార్యక్రమం వేడుకగా జరిగింది. తితిదేలో విలీనమైన తర్వాత తొలిసారి.. కొత్తగా నిర్మించిన కోనేరులో చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు తరలివచ్చారు. సాయంత్రం ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా సాగింది. సోమవారం పుష్పయాగం నిర్వహించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేశారు.
3. నేడు తిరుమలలో మహా సంప్రోక్షణకు అంకురార్పణ
తిరుమల శ్రీభూవరాహస్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సోమవారం అంకురార్పణ జరగనుంది. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవాన్ని తితిదే నిర్వహించనుంది. వసంత మండపంవద్ద పుట్టమన్ను సేకరించి యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఈనెల 23 నుంచి 27 వరకు మందిర మహాసంప్రోక్షణ జరుగుతుంది. ఈ కారణంగా 5 రోజులపాటు శ్రీవరాహస్వామివారి దర్శనాన్ని తితిదే నిలిపివేయనుంది.
4. 24న సత్యసాయి ఆరాధనోత్సవం
సత్యసాయి ఆరాధనోత్సవాలను ఈ నెల 24న ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహిస్తామని ట్రస్టు సభ్యుడు ఆర్.జె.రత్నాకర్ ఆదివారం తెలిపారు. భక్తులు మహా సమాధిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. హిల్‌వ్యూ స్టేడియంలో నారాయణ సేవ కార్యక్రమం జరుగుతుందని, ఉదయం 10.30కు భక్తులకు చీర, ధోవతి, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తామని తెలిపారు.
5.గోరంత స్తంలోనే పన్నెండు శివలింగాలు
చిటికెల వేలు గోరంత స్థలంలోనే ఏకంగా పన్నెండు శివలింగాలు రూపొందించి అబ్బురపరిచారు. ఓడిసా రాష్ట్రం గుణుపురం పట్టణానికి చెందిన కళాకారుడు శ్రీకాంత్ ఈయనకు చిన్నతనం నుంచీ భిన్న వస్తువులను తాయారు చేయడం అంటే ఎంతో ఇష్టం స్వర్ణకారుల కుటుంబం నుంచి రావడంతో సూక్ష్మ వస్తువులను తాయారు చేయడం పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈక్రమంలో బంగారం పెన్సిల్ మొనలను వినియోగించి పన్నెండు సూక్ష్మ శివలింగాలను రూపొందించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవాల్లో వీటిని ప్రదర్శించి అందరి ప్రసంసలు పొందారు.
6. కిటకిటలాడిన సుబ్రహ్మణ్యేశ్వరుని కోవెల
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.. చిన్నారులకు అన్నప్రాశనలు, ఉయ్యాలలో వేయటం, పుట్టువెంట్రుకలు తీయటంతో ఆలయం కళకళలాడింది. భక్తులు స్వామివారి పుట్టలో పాలుపోసి, అభిషేకాలు నిర్వహించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు. మహిళలు సంతానం కోసం పాలపొంగళ్లు పొంగించి ఆలయం చుట్టూ పొర్లు దండాలు పెట్టారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇందులో ఆలయ ఏసీ వీవీ.పల్లంరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
7. ఘనంగా శ్రీరాముని పట్టాభిషేకం
మచిలీపట్నంపట్టణంలోని జగన్నాధపురం రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి పట్టాభిషేకం జరిపించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు లంకె నారాయణప్రసాద్ పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. రవీంద్రకు ఆలయ నిర్వాహకకమిటీ సభ్యులు మాదిరెడ్డి అంజిబాబు తదితరులు స్వాగతం పలికి సత్కరించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
8.మోపీదేవి ఆలయం కిటకిట
మోహినీపురం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కుబడులు చెల్లించి రుద్రాభిషేక పూజలు చేశారు. సాధారణ అభిషేకాల్లో పాల్గొన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నా భక్తుల రాక తగ్గలేదు. అమ్మవార్లకు, స్వామికి మొక్కుబడులుగా కొత్త వస్త్రాలు అందజేశారు. స్వామి నిత్యశాంతి కల్యాణ మహోత్సవంలో 60 మంది కుటుంబాలు పాల్గొన్నాయి. నాగదేవతను కొలిచి పొంగళ్లు సమర్పించారు. చిన్నారులకు అన్నప్రాశనలు, అక్షరాభ్యాసాలు, నామకరణ, ఊయల సేవ మొక్కులు తీర్చుకున్నారు. రాహు, కేతు, నాగదోష నివృత్తి పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ ఎం.శారదాకుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
9.ముగిసిన కళ్యాణ బ్రహ్మోత్సవాలు
స్వయంభు శ్రీమహావిద్యాగణపతి కల్యాణ బ్రహ్మోత్సవాలు మూడు రోజులపాటు కనుల పండువగా నిర్వహించారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురంలోని శ్రీమహావిద్యా గణపతిస్వామి ద్వితీయ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19న ప్రారంభంకాగా ఆదివారంతో ముగిశాయి. మూడో రోజు ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి, వసంతోత్సవం, గంధోత్సవం, చూర్ణోత్సవం, అవభృధస్నానం, త్రిశూల పూజా కార్యక్రమాలను ఉయ్యూరు, లక్ష్మీపురం కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు-అనూరాధ దంపతులు నిర్వహించారు. ధ్వజాపరోహణ, మూకబలి, ద్వాదశ ప్రదక్షణలు, పవళింపు సేవ, శయనోత్సవం-ఆశీర్వచనములు చేశారు. ఉదయం ప్రత్యేక వాహనంపై శ్రీమహావిద్యాగణపతి స్వామి ఉత్సవ విగ్రహాలతో లక్ష్మీపురం, రామానగరంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కేసీపీ జీఎం జి.బుల్లిపిచ్చేశ్వరరావు, కేసీపీ డీజీఎం మండవ రామ్మోహనరావు పాల్గొన్నారు.
10. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 22
1870 : రష్యా విప్లవనేత లెనిన్ జననం (మరణం 1924).
1914 : దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, హిందీ చలనచిత్ర దర్శకుడు బి.ఆర్.ఛోప్రా జననం (మరణం 2008).
1936 : జాతీయ బీసీ కమిషన్ అధ్యక్షుడిగా నియమితులైన తెలుగు వ్యక్తి మకాని నారాయణరావు జననం.
1959 : భారత పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జననం.
1970 : ఐక్యరాజ్యసమితి ధరిత్రీ దినోత్సవం గా ప్రకటించింది. మొదటి ధరిత్రీ దినోత్సవం.
1971 : ప్రముఖ టెన్నిస్ ఆటగాడు (స్వీడను దేశస్థుడు) నిక్లాస్ కుల్టి జననం.
1980 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, ఫ్రిట్జ్ స్ట్రాస్మాన్ మరణం (జననం 1902).
1994: అమెరికా 37వ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం (జననం 1913).
image.gif11. స్వామి వారి బంగారం తరలింపుపై దర్యాప్తు షురూ
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలో వేంపట్టు చెక్‌పోస్టు వద్ద అనుమానాస్పద పరిస్థితిలో దొరికిన తిరుమల శ్రీవారికి చెందిన 1381 కిలోల బంగారంపై సమగ్ర విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఆదేశించారు. రెవెన్యూ ఎండోమెంట్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ విచారణ జరిపి ఈ నెల 23 లోపు నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 17 వ తేదీన ఈ బంగారం దొరికిన విషయం తెలిసిందే. టిటిడి విజిలెన్స్ వింగ్ పాత్ర ఏమిటో కూడా ఇందులో దర్యాప్తు చేస్తారు. ఎలాంటి రక్షణ లేకుండా అంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఎలా ఒక చోట నుంచి మరొక చోటకు తరలిస్తారు అనేది ప్రధాన ప్రశ్న. అంతేకాకుండా సరైన పత్రాలు లేకుండా బంగారం తరలించాల్సిన అవసరం ఏమిటనేది మరొక ప్రధాన ప్రశ్న. చెన్నైలోని ఒక బ్యాంకు నుంచి తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి బంగారాన్ని ఎందుకు తరలిస్తున్నారు? ఎవరి వద్దకు తరలిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో బంగారం ఎలాంటి పత్రాలు లేకుండా సరైన రక్షణ లేకుండా ఎందుకు తరలిస్తున్నారు అనే విషయాలు ఈ విచారణలో తేలాల్సి ఉంటుంది. తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పోలీసులు అన్ని వాహనాలు తనిఖీ చేస్తున్నారు కాబట్టి ఈ బంగారం దొరికింది కానీ అలా కాకపోయినట్లయితే ఈ 1380 కిలోల బంగారం ఏ పెద్ద మనిషి చేతికి చిక్కి ఉండేది అనేది పెద్ద ప్రశ్న.ఇంత బంగారం చూసి పోలీసులే షాకయ్యారుపట్టుకున్న పోలీసులే ఇదంతా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కి చెందినది అని తెలియడంతో ఈసీ అధికారులతో బాటు షాకయ్యారు.బంగారాన్ని తరలిస్తున్న వాహనాల్లో ఎటువంటి ఆధారాలు లేకపోవటంతో ఆ బంగారాన్ని తమిళనాడులోని పూందమల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఏప్రిల్ 18న ఈసీ అధికారులను కలిసి నగలకు సంబంధించిన ఆధారాలు చూపించారు. ఈ తర్వాత ఈ బంగారాన్నిఏప్రిల్ 19న టీటీడీ ఖజానాకు జమచేస్తామని పీఎన్బీ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ ఖజానాకు ఈ బంగారం చేరింది. ఇది జరిగిన తర్వాత టీటీడీ చైర్మన్ కానీ, ఈవో కానీ, ఇతర అధికారులు కానీ ఆ బంగారం గురించి నోరు మెదపలేదు. దీనిపై చాలా మందికి అనుమానాలు ఉన్నా కూడా ఎవరూ మాట్లాడటం లేదు. స్వామివారి విషయంలో ఆయనే జాగ్రత్తలు తీసుకుంటారులే అని ఆధ్యాత్మిక స్వాములు మాట్లాడకుండా ఉన్నారు. ఎవరి పాపాన వారే పోతారులే అని భక్తులు మిన్నకున్నారు. ఎన్నికల హడావుడిలో పడి రాజకీయ నాయకులు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. చివరకు నిబంధనల ప్రకారం దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయించారు. ఆయన నిర్ణయం పై భక్తులు ఎంతో ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నారు.
12. ఏప్రిల్ 22 సోమవారం 2019..మీ రాశిఫలాలు
మేషం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే చిరాకు ఎక్కువవుతుంటుంది. తలపెట్టిన ప్రయాణం ఆగిపోవడం కానీ, వాయిదా పడటం జరగవచ్చు. అలాగే ఉద్యోగ విషయంలో పైఅధికారుల నుంచి అవమానాలు ఎదురయ్యే అవకాశముంటుంది.
వృషభం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యులకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూలం.
మిథునం : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీగృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు పరిష్కరించబడతాయి.
కర్కాటకం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్ర త్త అవసరం. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవడం చేస్తారు.
సింహం : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూసంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.
కన్య : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
తుల : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయడానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
వృశ్చికం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలువసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
ధనుస్సు : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.
మకరం : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు.
కుంభం : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి.
మీనం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
24న సత్యసాయి ఆరాధనోత్సవం
Related tags :