స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక నెంబర్‌ను తమ పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటారు. అదే విధంగా ఆన్లైన్ వేదికగా లావాదేవీలు నిర్వహించాలన్నా పాస్వర్డ్ తప్పనిసరి. అయితే, ఇప్పటికీ లక్షలమంది ప్రజలు అత్యంత సులువైన, అందరూ గుర్తించే పాస్వర్డ్ లను పెట్టుకుంటున్నారట. ఇందులో ఎక్కువమంది ‘123456’ నెంబర్‌ను తమ పాస్వర్డ్ గా పెట్టుకుంటున్నట్లు తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. యూకేకు చెందిన నేషనల్ సైబర్ సెక్యురిటీ సెంటర్(ఎన్సీఎస్సీ) చేసిన అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రజలు తమకు ఎక్కువగా గుర్తుండే అంకెలనే పాస్ వర్డ్ గా పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్సీఎస్సీ తెలిపింది.ప్రజలు ఎక్కువగా వినియోగించే అంకెలను, పదాలను ఎన్సీఎస్సీ విశ్లేషించింది. వీటిలో 23మిలియన్ల మంది అంటే దాదాపు 2.30కోట్ల మంది ‘123456’ అంకెను తమ పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారట. ఆ తర్వాత అత్యధికమంది కంప్యూటర్ కీబోర్డ్ లేదా, మొబైల్ ఫోన్ కీ ప్యాడ్లోని మొత్తం అంకెలు ‘123456789’ను పాస్వర్డ్ గా పెట్టుకున్నారని ఎన్సీఎస్సీ తెలిపింది. మరికొంతమంది తమ పాస్వర్డ్ గా ‘qwerty’ ఆంగ్ల అక్షరాలను పెట్టుకోగా, ఇంకొంతమంది ‘password’ అనే పదాన్ని, మరికొంత మంది ‘1111111’ అంకెను పాస్వర్డ్ గా పెట్టుకున్నారు. ఇక పేర్ల విషయానికొస్తే, యష్లీ, మైఖేల్, డానియల్, జెస్సికా, చార్లీ పేర్లు ఎక్కువమంది పాస్వర్డ్ లుగా ఉన్నాయి.
మీ మొహాలు మండ – 111111 పాస్వర్డ్ ఏంటిరా?
Related tags :