ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బరిలో నిలిచిన వారణాసిలో పోటీ చేయాలని నిజామాబాద్ పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 50 మంది పసుపు రైతులు ‘ఛలో వారణాసి’ కార్యక్రమం చేపట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని కర్షకులు తెలిపారు. పసుపుబోర్డు ఏర్పాటు, పంటకు మద్దతు ధర సాధనే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ గ్రామీణం నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తునట్లు పేర్కొన్నారు.
మోడీ మీద వారణాసి నుండి పోటీ చేయనున్న నిజామబాద్ పసుపు రైతులు
Related tags :