????????????☘?????????☘?
*** కావల్సినవి: అన్నం- కప్పు(పొడి పొడిగా వండుకోవాలి), పల్లీలు- అరకప్పు, ఉప్పు- రుచికి తగినంత, ఎండుమిర్చి- ఆరు, నూనె- రెండుచెంచాలు, సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర- అన్నీ కలిపి రెండు చెంచాలు, కరివేపాకు- నాలుగు రెబ్బలు
*** తయారీ: పల్లీలు, నాలుగు ఎండుమిర్చిని నూనె లేకుండా వేయించుకోవాలి. కాస్త చల్లారాక పల్లీలు పొట్టు తీసి ఎండుమిర్చితో కలిపి పొడి చేసుకోవాలి. తరవాత బాణలిలో నూనె వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. అందులో తాలింపు దినుసులు, కరివేపాకు, మిగిలిన ఎండుమిర్చి వేసి.. వేగాక అన్నం, పల్లీల పొడీ, ఉప్పు వేసి బాగా కలపాలి. వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.
??????????????☘????????????