Kids

అది వజ్రాల రహస్యం

the secrets of diamonds

మనకు తెలిసిన పదార్థాల్లో అత్యంత దృఢమైన, కఠినమైన పదార్థం వజ్రమే. భూమి పైపొరల ఒత్తిడి వల్ల భూమికున్న లోపలి పొరల్లో నిక్షిప్తమైన బొగ్గు, గ్రాఫైట్‌ నుంచి చాలా తక్కువగా వజ్రపు ముక్కలు ఏర్పడతాయి. కర్బన పరమాణువులన్నింటి మధ్య టెట్రా హెడ్రల్‌ త్రిమితీయ విధానంలో రసాయనిక బంధాలు ఏర్పడతాయి. దీని వల్లనే వజ్రానికి అంతటి దృఢత్వం, స్థిరత్వం వచ్చాయి. వజ్రాలు దాగి ఉండే భూమి పొరల్లో ఉష్ణోగ్రత వజ్రాన్ని కూడా మండించగలిగే మోతాదులో ఉంటుంది. కానీ అక్కడ సరైన పరిమాణంలో ఆక్సిజన్‌ లేదు. ఏదైనా మండాలంటే దానికి తగ్గ ఆక్సిజన్‌ ఉండాలి. కానీ నేలపైపొరల ఒత్తిడి వల్ల వజ్రపు ద్రవీభవనస్థానం పెరుగుతుంది. అంటే సాధారణ ద్రవీభవన స్థానం కన్నా అధిక ఉష్ణోగ్రత దగ్గర కూడా అధిక పీడనంలో పదార్థాలు ఘనస్థితిలో ఉండగలవు.