Movies

సగం పూర్తిచేశాం

chappak movie finishes half schedule

టైమ్‌ టేబుల్‌ ప్రకారం క్రమశిక్షణగా ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లారు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌. ‘చప్పాక్‌’ సినిమా కోసమే ఆమె పాఠాలు నేర్చుకుంటున్నారు. ‘రాజీ’ ఫేమ్‌ మేఘన గుల్జార్‌ దర్శకత్వంలో దీపికా పదుకోన్‌ ప్రధాన పాత్రలో ‘చప్పాక్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఢిల్లీలో ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ముగిసింది.ఈ షెడ్యూల్‌లో సినిమాలోని లక్ష్మీ స్కూల్‌డేస్‌ సీన్‌లు తీశారు. అందుకే దీపికా స్కూల్‌కి వెళ్లారు. ఇక నెక్ట్స్‌ షెడ్యూల్‌ను టీమ్‌ ముంబైలో ప్లాన్‌ చేసినట్లు బాలీవుడ్‌ టాక్‌. ‘‘విజయవంతంగా సగం దూరం ప్రయాణించాం. ఢిల్లీ షెడ్యూల్‌ పూర్తిచేశాం’’ అని దర్శకురాలు మేఘనగుల్జార్‌ పేర్కొన్నారు. ఈ సినిమాకు దీపికా పదుకోన్‌ కూడా ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు.