రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. భుజంలో గాయం కారణంగా అతడిని పక్కనపెట్టినట్లు ఆ జట్టు ఛైర్మన్ సంజీవ్చురీవాలా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్టెయిన్ భుజంలో గాయం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈ ఐపీఎల్ సీజన్లో కొనసాగడని స్పష్టంచేశారు. అతడి ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా స్టెయిన్ రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉండి నేరుగా ఇటీవలే ఐపీఎల్లో చేరాడు. కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై ఆడిన రెండు మ్యాచుల్లో బెంగళూరు తరఫున నాలుగు వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సంజీవ్ మాటల్లో ‘డేల్ స్టెయిన్ సేవలు మా జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. అతడి ఆటతీరుతో మా ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిచ్చాడు. ఆటపట్ల అతడికున్న అంకితభావం అమోఘం. అతడిని కోల్పోవడం బాధగా ఉన్నా ఆరోగ్య పరిస్థితి రిత్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. అతడు త్వరగా కోలుకొని భవిష్యత్ బాగుండాలనుకుంటున్నా’ అని వివరించాడు.
స్టెయిన్ను ఇంటికి పంపించారు
Related tags :