Movies

ప్రేమ గుడ్డిదని నిరూపించారు

malaika arjun wedding rumors

బాలీవుడ్‌ నటి మలైకా అరోరాతో ప్రేమ విషయంపై ఎట్టకేలకు నోరు విప్పారు అర్జున్‌ కపూర్‌. 33 ఏళ్ల అర్జున్‌.. ఓ బిడ్డకు తల్లయిన మలైకాతో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. జూన్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మలైకాను కోడలిగా చేసుకోవడానికి అర్జున్‌ తండ్రి బోనీ కపూర్‌ కూడా ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. వీటిపై తాజాగా అర్జున్‌ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘నాకు మలైకా ఎంతో ప్రత్యేకం. కానీ మా పెళ్లి ఇప్పుడే జరగదు. నా వయసు 33. నాకు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా పెళ్లి గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నాకు వివాహమైతే మీకు కూడా తెలుస్తుంది కదా. ఈ కాలంలో ఏదీ ఎక్కువ రోజులు దాచలేం. తప్పుడు వార్తలు సృష్టించడం మంచిది కాదు. కానీ ప్రతిసారీ వీటిపై స్పందించడం నాకు నచ్చదు. ఎక్కువ సేపు వీటికి సమయం కేటాయిస్తే అలసిపోతాం. వదంతులు ఎంతగా ఎక్కువైపోయాయంటే.. ఇదివరకు అవి నమ్మేవారే ఇప్పుడు విసుగెత్తి ఊరుకుంటున్నారు. నాకు ఏదీ దాచాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన వారు చుట్టూ ఉంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది?’ అని వెల్లడించారు అర్జున్‌. ప్రస్తుతం అర్జున్‌.. ‘పానిపట్‌’, ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.