పురుషులలో ఎక్కువ శాతం వరకు మరణాలకు కారణం- గుండెపోటు.గుండెపోటు కలిగే సమయంలో ఛాతి ప్రాంతంలో బరువుగా భావిస్తుంటారు.ఛాతిలో నొప్పి గుండెపోటుకు ఒక సంకేతంగా చెప్పవచ్చు.ఛాతిలో నొప్పి ప్రారంభమై, మెడ, చేతులు & వీపు వైపు వ్యాప్తి చెందుతుంది. ప్రపంచవ్యాపంగా పురుషులలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికం. మనలో చాలా మంది అకస్మాత్తుగా, ఛాతి ప్రాంతంలో చేతులు వాల్చి, ఉన్నట్టు ఉండి కుప్పకూలి, మరణాల భారినపడుతున్నారు, దీనికి కారణం గుండెపోటు.అందరిలో గుండెపోటు ప్రత్యేక లక్షణాలను బహిర్గత పరుస్తూ కలగదు. చాలా మంది పురుషులు, మొదటగా అనారోగ్యంగా అనిపిస్తుంది మరియు ఆస్పిరిన్ తీసుకొని విశ్రాంతి తీసుకుంటారు.ఛాతిలో నొప్పి:పురుషులలో గుండెపోటు కలగటానికి ముందు బహిర్గతమయ్యే ప్రధాన లక్షణం. ఈ నొప్పి తీవ్రంగా లేదా ఒకే సమయానికి కలగదు. ఛాతిలో ఒత్తిడితో, పిండినట్టుగా అనిపిస్తూ, భారంగా, బిగుతుగా లేదా తిమ్మిరిగా అనిపిస్తూ, భుజాలు మరియు వీపు వైపు విస్తరిస్తుంది మరియు ఈ నొప్పి వస్తూ, పోతూ లేదా అసౌకర్యంగా ఉంటుంది. గుండెపోటుకు గురయ్యే ముందు బహిర్గతమయ్యే మరొక సంకేతంగా దీనిని పేర్కొనవచ్చు. చాలా మంది అజీర్ణం లేదా గుండెమంటగా భావించి, “రానిటిడిన్” లేదా “ఆంటాసిడ్” మందులను తీసుకొని తప్పు చేస్తుంటారు. కొంతమంది పురుషులలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించే భావన ఛాతి నుండి భుజాలు, మెడ మరియు వీపు వైపు విస్తరించవచ్చు. కొంతమంది ఉద్రేకతలకు గురవటం, చమట లేదా చర్మరంగు మారటం వంటి లక్షణాలు బహిర్గతం అవుతాయి.మరికొంత మంది పురుషులలో శ్వాసలో తగ్గుదల, శ్వాస తీసుకోవటానికి ఇబ్బందిగా అనిపించటం, మైకం, బలహీనంగా అనిపించటం లేదా డోకులు వంటి లక్షణాలు బహిర్గతం అవవచ్చు.గుండెపోటు కలిగే సమయంలో కొంతమంది పురుషులు స్పృహ కోల్పోతారు. మీరు అడిగే ప్రశ్నలు మరియు ఆదేశాలకు స్పందించలేరు. హృదయ స్పందన తగ్గిపోవచ్చు లేదా నాడీ కొట్టుకోవటం వేగంగా మారవచ్చు. గుండెపోటు కలిగే ముందు బహిర్గతమయ్యే లక్షణాల గురించి ముందే అవగాహన కలిగి ఉండటం వలన తగిన జాగ్రత్తలు తీసుకొని మరణాల సంఖ్య తగ్గించవచ్చు. ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని కలిసి చెక్ చేయించాలి.
పురుషుల్లో గుండెపోటు ఇలా గుర్తించవచ్చు
Related tags :