ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తన యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ట్విట్టర్‌లో యూజర్లు ఎవరికైనా తప్పుదోవ పట్టించే లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే విధంగా ఉన్న ట్వీట్లు కనిపిస్తే వాటిపై రిపోర్ట్ చేయవచ్చు. అందుకు గాను యాప్ లేదా డెస్క్‌టాప్‌లో సదరు ట్వీట్ల కింద ఉండే డ్రాప్ డౌన్ మెనూను ఓపెన్ చేయాలి. అందులో రిపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుని అనంతరం వచ్చే విండోలో ఆ ట్వీట్ ఏవిధంగా తప్పుదోవ పట్టిస్తుందో, అది యూజర్లను ఎలా ప్రభావితం చేస్తుందో కామెంట్ ఎంటర్ చేసి కింద ఉండే సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. దీంతో అలాంటి తప్పుదోవ పట్టించే ట్వీట్లపై ట్విట్టర్‌కు రిపోర్ట్ వెళ్తుంది. ట్విట్టర్ టీం అందుకు స్పందించి.. ఆ ట్వీట్లను పరిశీస్తుంది. నిజంగానే ఆ ట్వీట్లు తప్పుదోవ పట్టించేవిగా , తప్పుడు వార్తలను ప్రచారం చేసే ట్వీట్లుగా ఉంటే వాటిని వెంటనే తొలగిస్తారు. అలాంటి మిస్‌లీడింగ్ ట్వీట్లను పెట్టే వారి అకౌంట్లను బ్లాక్ చేస్తారు. కాగా ఈ ఫీచర్ ప్రస్తుతం భారత్‌లోని ట్విట్టర్ యూజర్లకే లభిస్తున్నది. ఈ నెల 29వ తేదీ నుంచి యూరప్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను యూరప్ దేశాల్లో అందుబాటులోకి తేనున్నారు.
దిద్దుబాటలో ట్విట్టర్
Related tags :