DailyDose

పెరిగిన బంగారం-వెండి ధరలు-వాణిజ్య-04/26

bullion prices on the rise again in india

Ø వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ. 31850, విశాఖపట్నంలో రూ. 32910, ప్రొద్దుటూరులో రూ.33000, చెన్నైలో రూ. 31930 గా ఉంది.

Ø డీజిల్‌ కార్ల అమ్మకాలు 2020 ఏప్రిల్‌ 1 నుంచి నిలిపేయాలని మారుతీ సుజుకీ ఇండియా నిర్ణయించింది. ఆ రోజు నుంచే బీఎస్‌-VI ఉద్గార నిబంధనలు అమల్లోకి రానుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘చిన్న తరహా డీజిల్‌ ఇంజిన్లను (1.5 లీటర్లలోపు) బీఎస్‌-VI ఇంజిన్లుగా మార్చాలంటే అధిక వ్యయం అవుతుంది. దీంతో కార్ల ధరలు బాగా పెరుగుతాయి. అందుకే 2020 ఏప్రిల్‌ 1 నుంచి డీజిల్‌ కార్ల అమ్మకాలను నిలిపివేస్తున్నామ’ని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ అన్నారు.

Ø సుమారు మూడేళ్ల తర్వాత ఇండిగో ఉద్యోగులకు తీపి కబురు అందింది. పైలట్లు, క్యాబిన్‌ సిబ్బందితో పాటు మిగతా ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచే వేతన పెంపు అమల్లోకి రానుంది.

Ø దేశంలో 2022 నాటికి 40 ఎల్‌ఈడీ సినిమా స్క్రీన్లు (ఓనిక్స్‌) విక్రయించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు శామ్‌సంగ్‌ ప్రకటించింది. సినిమా పరిశ్రమ ఆధునిక సాంకేతికతల వైపు విస్తరిస్తున్న తరుణంలో ఈ వ్యాపారం మంచి అవకాశంగా భావిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ‘2020కి 20 స్క్రీన్లు, 2022 నాటికి 40 ఓనిక్స్‌ తెరల్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామ’ని శామ్‌సంగ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు (కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌) పునీత్‌ సేథి వెల్లడించారు.

Ø జెట్‌ ఎయిర్‌వేస్‌ కష్టాలు.. ఇతర విమానయాన సంస్థలకు కలిసివస్తున్నాయి. ముఖ్యంగా ఇండిగో, స్పైస్‌జెట్‌ షేర్లు ఇబ్బడిముబ్బడిగా లాభాలను అందుకున్నాయి. గత ఆరు నెలల కాలంలో ఇవి వరుసగా 80 శాతం; 77 శాతం చొప్పున దూసుకెళ్లాయి.

Ø ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్‌కు మహీంద్రా అండ్‌ మహీంద్రా 50 విద్యుత్‌ కార్లు అందించింది. వీటిని ఈఈఈ-ట్యాక్సీ పేరుతో నడపనున్నారు.

Ø మున్సిపల్‌ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల(ఎఫ్‌పీఐ)కు అనుమతినిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది.

Ø టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) షేర్లు స్టాక్‌ మార్కెట్‌లలో హవా కొనసాగిస్తున్నాయి. లాభదాయకత తగ్గకుండానే.. వృద్ధిని నిలబెట్టుకోవడంతో మదుపర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. ఈ అంశాల్లో ఇన్ఫోసిస్‌ వెనకడుగు వేయడం సంస్థ షేర్లకు ప్రతికూలంగా మారింది.

Ø దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ చివరిలో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు పరుగులు తీశాయి. బీఎస్సీ సెన్సెక్స్‌ 336 పాయింట్ల లాభంతో 39,000 మార్కును దాటి, 39,067 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్క్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 112 పాయింట్ల లాభపడి, 11,754 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.04గా ఉంది.

Ø మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.1,505 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18 ఇదే కాలంలో బ్యాంకు రూ.2,188 కోట్ల నికర నష్టాన్ని చవిచూడటం గమనార్హం.

Ø హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ సేవల సంస్థ సైయెంట్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం 2018-19 నాలుగో త్రైమాసికంలో రూ.188 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1162 కోట్లు ఉంది.

Ø దేశీయ ఉక్కు దిగ్గజ సంస్థ టాటా స్టీల్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.2,295.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన రూ.14,688.02 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 84.37 శాతం తక్కువ.

Ø బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.213.70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18 ఇదే కాలంలో సంస్థ ఆర్జించిన రూ.130.4 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 64 శాతం ఎక్కువ.

Ø రిటర్న్ లు దాఖలు చేయని కారణంగా ఎవరివైతే జీ ఎస్ తీ లైసెన్సులు రాద్దయ్యయో, వాళ్ళు లైసెన్సులు పునరుధారణ కోసం జూలై 22 వరకు దరకాస్తు చేసుకోవచ్చని రెవెన్యూ శాఖా పేర్కొంది.