NRI-NRT

నీకు బెయిల్ ఎందుకురా?

london court slams nirav modis bail plea and rejects it

పంజాబ్ నేషనల్ బ్యాంక్​ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీకి లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ కోర్టు బెయిల్​ నిరాకరించింది. ఆయనకు విధించిన రిమాండ్​ను మే 24 వరకు వాయిదా వేసింది. అక్రమ ఎల్​ఓయూల ద్వారా భారతీయ బ్యాంకులను రూ. 13 వేల కోట్ల మేర మోసగించినట్లు నీరవ్​ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చేసరికి ఆయన లండన్​ పరారయ్యారు. మార్చిలో లండన్ బ్యాంకులో ఖాతా తెరిచేందుకు వెళ్లిన నీరవ్​ మోదీని పోలీసులు అరెస్టు చేశారు.