దక్షిణ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. మధ్యాహ్నం లోపు అల్పపీడనం వాయుగుండంగా మారింది. 36 గంటలు గంటల్లో వాయుగుండం తుఫాన్ గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కు ఫణి అని నామకరణం చేశారు. దీని ప్రభావం తమిళనాడు పై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 27వ తేదీ నుండి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈనెల 30 న తుఫాను తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో కన్యాకుమారి తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తమిళనాడును కాటేయనున్న “ఫణి”
Related tags :