నటిస్తారు.. కవ్విస్తారు.. ఇంతేనా? సినీతారలు చేసే మరో పని కూడా ఉంది. అదే ఫ్యాషన్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవడం. ఔను.. సొగసుల దుస్తులు వేసుకోనిదే వాళ్లకి పూట గడవదు. కెమేరా ఫ్లాష్‌లు మేనిని నిమరందే నిద్దుర పట్టదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ని ఆదరిస్తారు. సృష్టిస్తారు. ఇదంతా చెప్పి వాళ్లు దేనిపై మోజు పడుతున్నారో చెప్పకపోతే అస్సలు బాగోదు కదా! హా.. వాళ్లు మనసు పడుతోంది ఖప్లేసూట్’పై. మోకాళ్ల కిందకి దిగని ఈ ఔట్‌ఫిట్ ఇంచుమించు జంప్‌సూట్‌లా కనిపిస్తుంది. నడుముపై బెల్ట్ అదనపు ఆకర్షణ. జంప్‌సూట్‌ని కురచగా మార్చేసి ప్లేసూట్ అంటున్నారని వాదించే సొగసు జ్ఞానులూ లేకపోలేదు. వాదోపవాదాల్ని పక్కనపెడితే బాలీవుడ్ భామలంతా ఈ స్టైల్‌కి ఫిదాలౌతున్నారు. లేతందాల ఆలియాభట్ నుంచి కర్వీ పరిణీతాచోప్రా వరకు ఏదో సందర్భం, సన్నివేశంలో ఈ డ్రెస్‌తో మురిసిపోతూనే ఉన్నారు. అదితీరావు హైదరీ వేసిన నలుపు రంగు ప్లేసూట్ అచ్చం హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టివార్ట్ వేసిన డ్రెస్‌లాగే ఉందన్నారు. పీకూ సక్సెస్‌మీట్‌లో ఆలియా వేస్తే అదుర్స్ అన్నారు. పరిణీతిచోప్రా ప్రైవేటు పార్టీలో వేస్తే, కంగనా తనూ వెడ్స్ మనూ సక్సెస్ మీట్‌లో తళుక్కుమంది. ఈషా గుప్తా అయితో ఓ అభిమానితో ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టింది. క్యాజువల్‌గా, పార్టీవేర్‌గా, ఆధునికంగా కనిపించే ఈ డ్రెస్‌పై ఇప్పుడు కాలేజీ అమ్మాయిలూ మనసు పడుతున్నారు. డెనిమ్ ప్లేసూట్లు అందులోనూ ఫ్లోరల్ ప్రింట్ల డిజైన్లు తెగ అమ్ముడవుతున్నాయంటున్నారు అమ్మకందార్లు. ధర విషయానికొస్తే బ్రాండ్, డిజైన్‌ని బట్టి రూ.వెయ్యి నుంచి లక్ష వరకు ఖరీదైనవి అందుబాటులో ఉన్నాయి.
ప్లేసూట్‌లో తళుక్కులు
Related tags :