Movies

ట్వింకిల్ ఫేవరేట్ పార్టీ…

twinkle khannas favorite party is

బాలీవుడ్‌ నటి, అక్షయ్‌ కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా.. భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా? అంటూ నెటిజన్లు సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అక్షయ్‌.. మోదీతో ముఖాముఖిలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ను ఉద్దేశిస్తూ.. ‘మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటారనుకుంటా. ఎందుకంటే మీ భార్య ఎప్పుడూ నన్ను తిడుతుంటారు కదా..’ అని అక్షయ్‌తో చమత్కరించారు. ఇందుకు ట్వింకిల్‌ ట్విటర్‌ వేదికగా బదులిస్తూ.. మోదీ కామెంట్స్‌ను తాను పాజిటివ్‌గా తీసుకుంటానని అన్నారు. దాంతో ట్వింకిల్‌ భాజపాలో చేరే అవకాశం ఉందని, అందుకే అక్షయ్‌, ట్వింకిల్‌ మోదీతో చనువుగా ఉంటున్నారని కామెంట్లు వచ్చాయి. ఈ కామెంట్లపై ట్వింకిల్‌ శుక్రవారం సోషల్‌మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘ఎక్కువ కాదు.. తక్కువ కాదు.. స్పందన అనేది ఎప్పుడూ ప్రచారం కిందికి రాదు. నేను చేరే ఏకైక పార్టీలో ఎక్కువగా వోడ్కా(మద్యం) షాట్స్‌ ఉంటాయి. ఆ తర్వాత రోజు హ్యాంగోవర్‌ ఉంటుంది’ అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు ట్వింకిల్‌.