ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌లో 50 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర(ఎంఅండ్‌ఎం) లిమిటెడ్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఉబర్ సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే విషయంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గతంలోనే ఎంఅండ్‌ఎం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటగా హైదరాబాద్‌లో మహీంద్ర ఈ2ఓ ప్లస్ హ్యాచ్‌బ్యాక్, మహీంద్ర వెరిటో సెడాన్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ఎంఅండ్‌ఎం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటి అవసరాల నిమిత్తం నగరంలో క్యాబ్ సేవలు అందిస్తున్న పబ్లిక్, ప్రైవేటు సంస్థలతో కలిసి పలు ప్రాంతాల్లో 30 కామన్ ఛార్జింగ్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ‘భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను పెంచే దిశగా కృషి చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఉబర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. సమీప భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఉబర్ ద్వారా మరిన్ని మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని మహీంద్ర ఎలక్ట్రిక్ సీఈవో మహేశ్ పేర్కొన్నారు.
ఇండియా ఊబర్‌లో మహీంద్ర విద్యుత్ కార్లు
Related tags :