2018 – 19 ఆర్థిక సంవత్సర ఫలితాలు ప్రకటించిన ఏఏఐ మిలియన్ మార్క్‌ను దాటి వృద్ధిలో దూసుకుపోతున్న బెజవాడ ఎయిర్‌పోర్టు 11,91,439 మంది ప్రయాణికుల రాకపోకలు రాకపోకలు సాగించిన విమానాలు.. 21,169
***నవ్యాంధ్ర గేట్‌వే.. విజయవాడ ఎయిర్‌పోర్టు దుమ్ము దులిపింది! తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ పరుగులు పెడుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న మిలియన్ మార్క్‌ను దాటేసి మరింత వృద్ధిరేటులో సాగుతోంది. శుక్రవారం విమానాశ్రయ ఉన్నతాధికారులు 2018 – 19 ఆర్థిక సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విజయవాడ విమానాశ్రయం నుంచి 11,91,439 మంది ప్రయాణీకలు రాకపోకలు సాగించారు. ఇది ఆల్‌టైమ్ రికార్డు! అలాగే ముగిసిన ఏడాది పొడవునా విమానాశ్రయం నుంచి 21,169 విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాయి.
***ఏడాదికేడాదికి ఇంతింతై వటుడింతైన చం దాన విజయవాడ విమానాశ్రయం దూసు కుపోతోంది. దేశంలో మెట్రోపాలిటన్ ఎయి ర్‌పోర్టులను తలదన్నేలా ఉన్న ఫ్లీట్‌లో వృద్ధిని సాధిస్తున్న విజయవాడ విమానాశ్రయం పది లక్షల ప్రయాణీకులు రాకపోకలు సాగించే జాబితాలో ఎప్పుడు చేరుతుందా అనే కోరిక ఇప్పుడు ఫలించింది. పది లక్షలమంది ప్రయాణికుల క్లబ్బులో ఇంకా చేరకముందే వాటిని మించిన వృద్ధిని నమోదు చేసిన విజ యవాడ ఎయిర్‌పోర్టు ఇప్పుడు ఏకంగా ఆ క్లబ్బులో చేరటంతో పాటు ఆర్థిక సంవ త్సరాంతానికి ఇంకా వృద్ధిరేటును మెరుగు పరచుకుంటూ దూసుకుపోతోంది.
**శనివారం విడుదల చేసిన ఎయిర్‌పోర్టు ఫలితాలు న వ్యాంధ్రలో విజయవాడ ఎయిర్‌పోర్టు రేం జ్‌ను చాటిచెప్పింది. ఫలితాల ప్రకారం చూ స్తే.. ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 11,91,439 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. దేశం, విదేశాల నుంచి విజయవాడ విమానా శ్రయానికి 6,51,762 మంది ప్రయాణీకులు వచ్చారు. విజయవాడ విమానాశ్రయం నుంచి 5,75,677 మంది ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాలకు బయలుదేరారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నెలకు 99,287 మంది ప్రయాణికుల చొప్పున రాకపోకలు సాగించారు. రోజుకు సగటున 3,264 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. ఆర్థిక సంవత్సరాంతాన అంతర్జాతీయ సర్వీసు ప్రారంభమైంది. ఇప్పటి వరకు 6,254 మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు.విజయవాడ విమానాశ్రయంలోమొత్తం 21,169 ట్రిప్పులను విమానాలు వేశాయి. వివి ధ ప్రాంతాల నుంచి విజయవాడకు 10,587 ట్రిప్పులు, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు 10,582 ట్రిప్పులు వేశాయి. సగటున నెలకు 1764 ట్రిప్పులు వేయగా, రోజుకు 58 ట్రిప్పులు వేయటం గమనార్హం.
****2018 – 19లో ప్రయాణికుల మూవ్‌మెంట్ ఇలా..
రాకపోకలు సాగించిన ప్రయాణికులు మొత్తం – 11,91,439
విమానాశ్రయానికి వచ్చిన వారి సంఖ్య – 6,15,762
విమానాశ్రయం నుంచి బయలు దేరిన వారు – 5,75,677
టాన్సిట్ పాసెంజర్లు – 21,983
సగటున నెలకు ప్రయాణించిన ప్రయాణికులు – 99,287
సగటున రోజుకు ప్రయాణించిన ప్రయాణికులు – 3,264
ప్రయాణించిన అంతర్జాతీయ ప్రయాణికులు – 6,254
****2018 – 19 ఆర్థిక సంవత్సరంలో విమానాల మూవ్‌మెంట్ ఇలా ..
మొత్తం మూవ్‌మెంట్ – 21,169
ఎయిర్‌క్రాఫ్ట్ అరైవల్స్ – 10,587
ఎయిర్‌క్రాఫ్ట్ డిపార్చర్ – 10,582
సగటున నెలకు మూవ్‌మెంట్ – 1764
సగటున రోజుకు మూవ్‌మెంట్ – 58
ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ – 68
****2013 – 2019 వరకు ప్రయాణికుల ప్రస్థానం ఇలా…
2013- 14 1,95,000
2014- 15 2,33,000
2015- 16 4,01,000
2016- 17 6,27,000
2017- 18 7,50,000
2018- 19 11,91,439
****2013 – 2019 వరకు విమానాల రాకపోకలు
2013- 14 4733
2014- 15 5386
2015- 16 7710
2016- 17 11,631
2017- 18 13,487
2018- 19 21,169
బంపర్ రికార్డుతో దూసుకుపోతున్న బెజవాడ విమానాశ్రయం
Related tags :