ఆస్ట్రియా దేశంలోని వియన్నా నగరంలో ఇవాళ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను టీఆర్ఎస్ ఆస్ట్రియా శాఖ అధ్యక్షుడు మేడిపల్లి వివేక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా వివేక్ రెడ్డి మాట్లాడుతూ.. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. బంగారు తెలంగాణ సాధనలో తమ వంతు సహకారాన్ని కూడా అందిస్తామని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కంది వంశీ, అనుమాండ్ల లక్ష్మారెడ్డి, లింగారెడ్డి, సంతోష్ రెడ్డి, రమేశ్ గౌడ్, రాజ్ కుమార్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వియాన్నాలో తెరాస ఆవిర్భావ వేడుకలు
Related tags :